Google Drive: గూగుల్ డ్రైవ్ వాడేవారికి అలర్ట్‌.. ఫొటోల బ్యాకప్ విషయంలో కీలక మార్పులు

Updated on: Aug 15, 2026 | 4:45 PM

కంప్యూటర్‌లోని ఫొటోలు, వీడియోలను Google Drive for Desktop ద్వారా Google Photosకు ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేసుకునే సదుపాయాన్ని గూగుల్ నిలిపివేసింది. ఇప్పటికే బ్యాకప్ అయిన ఫైళ్లకు ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేసింది. ఇకపై కంప్యూటర్‌ నుంచి కొత్త ఫొటోలు, వీడియోలను బ్యాకప్ చేసుకోవాలంటే Google Photos వెబ్‌సైట్‌లో ‘Backup Folders’ ఆప్షన్ ద్వారా సెటప్ చేసుకోవాలి. బ్రౌజర్‌ తెరిచి ఉన్నప్పుడే బ్యాకప్ కొనసాగుతుంది.

కంప్యూటర్‌లోని ఫొటోలు, వీడియోలను గూగుల్‌ డ్రైవ్‌ ద్వారా గూగుల్‌ ఫొటోస్‌లో ఆటోమేటిక్‌గా బ్యాకప్‌ చేసుకుంటున్నారా? అయితే ఈరోజు నుంచి ఆ సదుపాయం నిలిచిపోనుంది. 2026 ఆగస్టు 10 నుంచి ‘గూగుల్‌ డ్రైవ్‌ ఫర్‌ డెస్క్‌టాప్‌’ ద్వారా గూగుల్‌ ఫొటోస్‌కు ఆటోమేటిక్‌ బ్యాకప్‌ ఉండదని గూగుల్‌ స్పష్టం చేసింది. దీంతో కంప్యూటర్‌లోని ఎంపిక చేసిన ఫోల్డర్ల నుంచి కొత్త ఫొటోలు, వీడియోలు ఇక గూగుల్‌ ఫొటోస్‌లోకి ఆటోమేటిక్‌గా అప్‌లోడ్‌ కావు. అయితే, ఇప్పటివరకు ఇప్పటికే బ్యాకప్ అయిన ఫొటోలు, వీడియోలకు ఎలాంటి ప్రమాదం లేదని, అవి సురక్షితంగానే ఉంటాయని గూగుల్ తెలిపింది. అలాగే సాధారణ గూగుల్ డ్రైవ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. కేవలం డ్రైవ్ నుంచి గూగుల్ ఫొటోస్‌కు ఉండే ఆటోమేటిక్ అనుసంధానాన్ని మాత్రమే తొలగించారు. ఈ మార్పుల వల్ల స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ ఫొటోస్ బ్యాకప్ వాడుతున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కంప్యూటర్ నుంచి ఫొటోలను నిరంతరం బ్యాకప్ చేసుకోవాలనుకునే వారు ఇకపై గూగుల్ ఫొటోస్ వెబ్‌సైట్‌లోనే కొత్తగా సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి ‘+’ ఐకాన్ ద్వారా ‘బ్యాకప్ ఫోల్డర్స్’ ఆప్షన్ ఎంచుకుని కంప్యూటర్‌లోని ఫోల్డర్లను ఎంపిక చేసుకోవాలి. అయితే, పాత విధానంలా కాకుండా ఈ కొత్త విధానంలో బ్రౌజర్‌లో గూగుల్ ఫొటోస్ వెబ్‌సైట్ తెరిచి ఉన్న సమయంలో మాత్రమే బ్యాకప్ ప్రక్రియ కొనసాగుతుంది. కెమెరా నుంచి లేదా స్కాన్ చేసిన పత్రాలను కంప్యూటర్‌లో దాచుకునేవారు వెంటనే ఈ కొత్త సెటప్‌ను ప్రారంభించుకోవాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Monsoon Update: పసిఫిక్‌లో ఎల్‌నినో సెగ.. భారత్‌లో నిలకడగా రుతుపవనాలు.. కరువు భయం లేనట్లే!

Loading...
Unable to load recommendations.
Follow Us