టాలీవుడ్‌పై తమన్నా విసుర్లు ఫైరవుతున్న సౌత్ ఇండస్ట్రీ!

Updated on: Jun 27, 2026 | 8:10 AM

దశాబ్దానికి పైగా దక్షిణాది చిత్రసీమలో అగ్రతారగా రాణించిన తమన్నా భాటియా, బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత సౌత్ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో హీరోయిన్లను గ్లామర్‌ కోణంలోనే చూపిస్తారని, పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుందని ఆమె విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నయా హాట్ టాపిక్ గా మారాయి.

కొంతమంది హీరోయిన్ల పరిస్థితి “ఏరు దాటే వరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న” అన్నట్టుగా ఉంది. దక్షిణాదిలో అవకాశాలు ఉన్నంత కాలం మన సినిమాలను, హీరోలను పొగిడిన వారే, బాలీవుడ్‌కు వెళ్లాక మన చిత్రాలను విమర్శించడం మొదలుపెడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో అగ్రనటి తమన్నా భాటియా కూడా చేరారు. టాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తమన్నా, తెలుగుతో పాటు దక్షిణాదిలోని అనేక భాషల్లో నటించి గుర్తింపు పొందారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు, స్పెషల్ సాంగ్స్‌తో బిజీగా ఉన్న తమన్నా, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సౌత్ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది చిత్రాలలో మహిళలను చూపించే విధానంలో పురుషాధిక్యత స్పష్టంగా కనిపిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. హీరోయిన్లను ఎక్కువగా గ్లామర్ కోణంలోనే చూపిస్తారని, గౌరవప్రదంగా కాకుండా కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం చేస్తారని విమర్శించారు. అయితే బాలీవుడ్‌లో మాత్రం నటన లేదా గ్లామర్ ఏదో ఒకటి ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుందని, కానీ సౌత్‌లో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సి వస్తుందని ఆమె పేర్కొన్నారు. దశాబ్దానికి పైగా సౌత్ ఇండస్ట్రీలో పనిచేసిన తమన్నా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అనేక మంది అభిమానులు, సినీ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తూ, ఆమె మాటలను ఖండిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

Follow Us