Super El Nino: సూపర్ ఎల్‌నినో ఎఫెక్ట్.. ఫిబ్రవరి లోపు 4.5 లక్షల మరణాలు!
ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో మరింత బలపడి ‘సూపర్ ఎల్‌నినో’గా మారితే తీవ్ర వేడి ప్రభావం పెరిగే అవకాశం ఉందని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ అంచనా వేసింది. జూన్ 2026 నుంచి ఫిబ్రవరి 2027 వరకు ప్రపంచవ్యాప్తంగా 4.51 లక్షల అదనపు వేడి సంబంధిత మరణాలు సంభవించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. భారత్‌లో సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 15,800 అదనపు మరణాలను అంచనా వేసింది. ఇదే సమయంలో వర్షపాతం లోటు వ్యవసాయంపై ఆందోళన పెంచుతోంది.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. రానున్న నెలల్లో ఎల్‌నినో మరింత తీవ్రతరమై ‘సూపర్ ఎల్‌నినో’గా మారే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన ‘క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్’ సంస్థ హెచ్చరించింది. దీని ప్రభావంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4.51 లక్షల మంది మరణించే అవకాశముందని తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సూపర్ ఎల్‌నినో ప్రభావం ప్రధానంగా దక్షిణార్థగోళంలోని దేశాలపై ఎక్కువగా ఉండనుంది. నైజీరియా, సూడాన్ వంటి ఆఫ్రికా దేశాల్లో 66,800 మంది, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి ఆగ్నేయాసియా దేశాల్లో 19,400 మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా వేశారు. భారత్‌లో దాదాపు 15,800 మంది, బ్రెజిల్‌లో 13,300 మంది మరణించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆగస్టు నెల చరిత్రలోనే అత్యంత ఉక్కపోత నమోదైన నెలగా నిలవడం ఈ తీవ్రతకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ముందస్తు ఉష్ణోగ్రత హెచ్చరికలు, కూలింగ్ సెంటర్లు, మెరుగైన ప్రజారోగ్య చర్యలు చేపట్టాలని సూచించారు. మరోవైపు, ఎల్‌నినో ప్రభావం దేశ వ్యవసాయ రంగంపైనా తీవ్రంగా పడనుందని ఐసీఐసీఐ బ్యాంకు నివేదిక స్పష్టం చేసింది. వర్షపాతం తగ్గడంతో ఖరీఫ్ పంటల దిగుబడి దెబ్బతినే అవకాశముంది. 2026 సెప్టెంబరు 21 నాటికి దేశంలో సగటు వర్షపాతం 15 శాతం తక్కువగా నమోదు కాగా, దక్షిణ భారతదేశంలో ఈ లోటు ఏకంగా 27 శాతానికి చేరింది. అంతేకాకుండా దక్షిణాది రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఏకంగా 52 శాతానికి పడిపోవడం వ్యవసాయ రంగానికి పెను సవాలుగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంజూ శాంసన్‌పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు!
Pitru Paksha 2026: ఈ ఏడాది పితృపక్షం ప్రారంభమయ్యేది అప్పుడే
ట్రంప్-జిన్‌పింగ్ భేటీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
బ్యాంకుకు వచ్చేవాళ్లంతా కస్ట్‌మర్లే కాకపోవచ్చు.. తస్మాత్ జాగ్రత్త
