జీవితం నీటి బుడగ అంటే ఇదేనేమో.. గుండె ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి..
గుండె ధైర్యం ఉన్నవాళ్లే ఈ వీడియో చూడండి.. ఎందుకంటే ఇలాంటి వీడియోలు చూసి మీరు మానసికంగా కుంగిపోవచ్చు. ఇటీవల ఆకస్మిక గుండెపోటు మరణాల గురించి వింటూనే ఉన్నాం.. చూస్తూనే ఉన్నాం. అయితే కొన్ని విజువల్స్ చూస్తే జీవితం మరీ ఇలా నీటి బుడగనా అనిపించక మానదు. తాజాగా ఖమ్మంలో ....
ఆకస్మిక గుండెపోటు మరణాలు కలవర పరుస్తున్నాయి. సడెన్‌గా అపస్మారక స్థితికి చేరుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. ఏమువుతుందో తెలియడం లేదు.. ఎందుకో అర్థం కావడం లేదు. అప్పటివరకు బాగానే ఉంటున్నారు. నవ్వుతూ మాట్లాడుతున్నారు. క్షణాల్లోనే ఈ లోకాన్ని వీడుతున్నారు. తాజాగా తెలంగాణలోని ఖమ్మంలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఖమ్మం నగరంలోని 3 టౌన్ ప్రాంతానికి చెందిన బొమ్మ సుస్మిత( 36 ) ఆమె బంధువులకు చెందిన ఓ గృహప్రవేశ వేడుకకు వెళ్లింది. ఫోటో దిగే సమయంలో గుండెపోటు రావటంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు.
Follow Us