ఆసియాకప్ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన టీమిండియా
ఆసియా కప్ ప్రజెంటేషన్ సెరిమనీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాక్ మంత్రి ఏసీసీ చీఫ్ నద్వీ చేతుల మీదుగా ట్రోఫీ, మెడల్స్ స్వీకరించేందుకు టీమిండియా నిరాకరించింది. పాకిస్తాన్ జట్టు వైఖరితో వేడుక ఆలస్యమైంది. ట్రోఫీ లేకుండానే భారత్ విజయోత్సవాలు జరుపుకోగా, పాక్ కెప్టెన్ రన్నరప్ చెక్ విసిరేసాడు.
ఆసియా కప్ ప్రజెంటేషన్ సెరిమనీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆసియా కప్ ట్రోఫీని స్వీకరించేందుకు టీమిండియా నిరాకరించింది. పాక్ మంత్రి ఏసీసీ చీఫ్ నద్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోమని భారత్ స్పష్టం చేసింది. భారత్ నిర్ణయంతో ఏసీసీ సిబ్బంది ట్రోఫీని వెనక్కి తీసుకువెళ్లాల్సి వచ్చింది. అంతేకాకుండా, మ్యాచ్ విన్నింగ్ మెడల్స్ సైతం భారత ఆటగాళ్ళు నిరాకరించారు. ఈ పరిణామాల మధ్య కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంటరాక్షన్ జరగలేదు. ట్రోఫీ, మెడల్స్ లేకుండానే టీమిండియా డగౌట్ దగ్గర విజయోత్సవాలు జరుపుకుంది. పాక్ మంత్రి నుంచి ట్రోఫీ తీసుకోవాలని భావించకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు, అవమాన భారంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు వెనుతిరిగింది. మ్యాచ్ తర్వాత గంట పాటు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమైంది పాకిస్తాన్ జట్టు. పాక్ ప్లేయర్ల వైఖరితో ప్రజెంటేషన్ సెర్మనీ ఆలస్యం అయింది. మ్యాచ్ ముగిశాక గంట దాటినా కూడా సెర్మనీ జరగకపోవడంతో గందరగోళం కనిపించింది. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ సల్మాన్ రన్నరప్ చెక్‌ను విసిరేశాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

