ఢిల్లీ మ్యాచ్‌కు రోహిత్, కోహ్లీ దూరం? అసలు నిజం ఇదే
భారత్-శ్రీలంక వన్డే సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 13న ఢిల్లీలో జరగాల్సిన తొలి మ్యాచ్ వేదిక మారే అవకాశం కనిపిస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో భారీగా పునరుద్ధరణ పనులు జరుగుతుండటమే ఇందుకు కారణం. ఈ పనులు సకాలంలో పూర్తికాకపోతే మ్యాచ్‌ను మరో నగరానికి తరలించవచ్చని సమాచారం. అదే జరిగితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను సొంతగడ్డపై చూడాలనుకున్న ఢిల్లీ అభిమానులకు నిరాశ తప్పదు.
అరవింద్ జైట్లీ స్టేడియం.. విరాట్ కోహ్లీ సొంతగడ్డ.. భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతిని పంచే వేదిక. కానీ, ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. స్టార్ క్రికెటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఢిల్లీ వేదికగా జరగాల్సిన మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ మాట విన్న ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. డిసెంబర్ నెలలో భారత్-శ్రీలంక వన్డే సిరీస్ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 13న జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కేవలం వన్డేలు, టెస్టుల్లో మాత్రమే కొనసాగుతుండటంతో, వారిద్దరినీ ప్రత్యక్షంగా మైదానంలో చూసేందుకు ఢిల్లీ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారీ ఎత్తున రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. స్టేడియం అవుట్‌ఫీల్డ్‌ను అత్యాధునిక సాంకేతికతతో సాండ్-బేస్డ్ సర్ఫేస్‌గా మారుస్తున్నారు. వర్షం పడిన వెంటనే నీరు ఇంకిపోయేలా అధునాతన డ్రైనేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు పూర్తి కావడానికి కనీసం నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తి కాకపోతే, మ్యాచ్‌ను వేరే వేదికకు మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కారణం వల్లే ఢిల్లీలో జరగాల్సిన మ్యాచ్ వేరే సిటీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే స్టేడియం పనుల వల్ల ఢిల్లీ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లను సైతం వేరే మైదానానికి మార్చాల్సి వచ్చింది. అయితే, గతంలో ఈ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌కు మారుస్తున్నారంటూ వచ్చిన వార్తలను బీసీసీఐ సెక్రటరీ కొట్టిపారేశారు. త్వరలోనే దీనిపై బోర్డు అధికారిక ప్రకటన చేయనుంది. ఏది ఏమైనప్పటికీ, సొంతగడ్డపై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ఆటను ప్రత్యక్షంగా కళ్లారా చూద్దామనుకున్న ఢిల్లీ ఫ్యాన్స్‌కు ఇది నిజంగానే పెద్ద నిరాశ అనే చెప్పాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రష్యా సైన్యంలో తెలంగాణ యువకులు!
ఆ ఇల్లే ఒక పాముల పుట్ట.. అడుగడుగునా పాము గుడ్లే!
చదువు నేర్పిన గురువుకు అరుదైన గౌరవం!