IPL 2027 వేలం ఇండియాలోనే.. గోవాలో మినీ ఆక్షన్‌!

Updated on: Sep 25, 2026 | 10:55 PM

క్రికెట్‌ అభిమానులకు బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. గత మూడేళ్లుగా విదేశాల్లో నిర్వహించిన ఐపీఎల్‌ వేలం ఈసారి భారత్‌కు తిరిగి రానుంది. డిసెంబర్‌లో గోవా వేదికగా ఐపీఎల్‌ 2027 మినీ వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా తెలిపారు. 2027 సీజన్‌కు ప్రతి జట్టుకు రూ.120 కోట్ల బేస్‌లైన్‌ పర్స్‌, రూ.157 కోట్ల సాలరీ క్యాప్‌ ఉంటుంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

క్రికెట్ ప్రేమికులకు భారత క్రికెట్ నియంత్రణ మందలి (బీసీసీఐ) ఊరటనిచ్చే తీపి కబురు అందించింది. గత మూడేళ్లుగా దుబాయ్, అబుదాబి, సౌదీ అరేబియా వంటి విదేశీ వేదికల్లో సాగిన ఐపీఎల్ వేలం ప్రక్రియ ఈసారి తిరిగి స్వదేశానికి చేరుకుంది. పర్యాటక ప్రాంతమైన గోవా వేదికగా ఈ ఏడాది డిసెంబర్‌లో ఐపీఎల్ 2027 మినీ వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అధికారికంగా ప్రకటించారు. ఈసారి జరగబోయేది మినీ వేలం కావడంతో ఫ్రాంచైజీలు తమ ప్రధాన ఆటగాళ్లను అట్టేపెట్టుకునే వెసులుబాటు ఉంది. 2027 సీజన్‌కు సంబంధించి ప్రతి జట్టు వద్ద బేస్‌లైన్ పర్స్ విలువ రూ.120 కోట్లుగా ఉండగా, మొత్తం సాలరీ క్యాప్‌ను రూ.157 కోట్లుగా నిర్ణయించారు. ప్లేయర్ల రిటెన్షన్, విడుదల ప్రక్రియ తర్వాత ఫ్రాంచైజీల వద్ద మిగిలే బడ్జెట్ స్పష్టమవుతుంది. మరోవైపు టీమ్‌లపై ప్రభావం చూపే ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఇక ఇతర క్రికెట్ విశేషాల్లో.. వర్షాల కారణంగా భారత్ ‘ఎ’, ఆస్ట్రేలియా ‘ఎ’ మహిళల జట్ల మధ్య ధర్మశాలలో జరగాల్సిన మల్టీ డే మ్యాచ్‌ను మొహాలీకి మార్చారు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి భారత్ ‘ఎ’ బోణీ కొట్టింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సాటా ఆధ్వర్యంలో ఘనంగా 96వ సౌదీ నేషనల్ డే వేడుకలు

అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి

గుడ్‌ న్యూస్‌.. తగ్గనున్న వంటనూనె ధరలు

Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధర

Super El Nino: సూపర్‌ ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ఫిబ్రవరి లోపు 4.5 లక్షల మరణాలు!

Loading...
Unable to load recommendations.
Follow Us