Telangana: శివపార్వతుల కల్యాణం జరుగుతుండగా.. గుడికి వచ్చి పడగవిప్పిన నాగుపాము
మహా శివరాత్రి వేడుకల్లో శివపార్వతుల కల్యాణం జరుగుతుండగా… ఆలయ ప్రాంగణంలో నాగుపాము ప్రత్యక్షమై భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో వెలుగుచూసింది. పూర్తి వివరాలు కథనం లోపల వివరంగా తెలుసుకుందాం పదండి ... ... ... ..
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తజనసందోహంతో కిక్కిరిసిపోయాయి. భక్తులు శివనామస్మరణతో పరవశించిపోయారు. ఈ క్రమంలోనే నిర్మల్ జిల్లాలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. దస్తురాబాద్ మండలంలోని గొడిసెర్యాల గ్రామంలో శ్రీ రాజా రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు నిర్వహించారు. శివపార్వతుల కల్యాణం జరుగుతుండగా.. ఒక్కసారి ఆలయ ప్రాంగణంలో నాగుపాము పత్యేక్షమైంది. పడగవిప్పి అది చాలా సేపు అక్కడే ఉండి.. ఆ తంతు అంతా గమనించింది. దీంతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. శివుడు నాగుపాము రూపంలో దర్శనం ఇచ్చాడని భక్తులు మొక్కులు చెల్లించారు.
Published on: Feb 16, 2026 07:27 AM
Loading...
Unable to load recommendations.
Follow Us