అయ్యప్ప సన్నిధిలో అపచారం.. స్ట్రాంగ్ రూమ్‌లో షాకింగ్ ట్విస్ట్!

Updated on: Sep 25, 2026 | 10:57 PM

శబరిమల అయ్యప్ప ఆలయంలోని బంగారు కిరీటం విషయంలో కీలక వివాదం వెలుగులోకి వచ్చింది. 2012లో భక్తులు సమర్పించిన 445.78 గ్రాముల కిరీటానికి బదులుగా స్ట్రాంగ్‌ రూమ్‌లో 240 గ్రాముల కిరీటం ఉన్నట్లు తనిఖీల్లో గుర్తించారు. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు జరిగిన పరిశీలనలో ఈ బరువు వ్యత్యాసం బయటపడింది. దీంతో కిరీటం మారిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు సమగ్ర విచారణకు ఆదేశించింది.

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని బంగారు కిరీటం విషయంలో పెద్ద వివాదం తలెత్తింది. సన్నిధానంలోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన అసలు బంగారు కిరీటం స్థానంలో మరో నకిలీ కిరీటం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. 2012 ఆగస్టులో తమిళనాడుకు చెందిన భక్తులు అయ్యప్ప స్వామికి 445.78 గ్రాముల బరువున్న బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించారు. అయితే, ఇటీవల కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు అమికస్ క్యూరీ జస్టిస్ కేటీ శంకరన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న కిరీటం బరువు కేవలం 240 గ్రాములు మాత్రమే ఉన్నట్లు తేలింది. దీంతో అసలు కిరీటాన్ని మార్చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్ట్రాంగ్ రూమ్‌లో సీసీటీవీ నిఘా కెమెరాలు లేకపోవడం, ఆదేశాల ప్రకారం కిరీటాన్ని ఆరన్ముల స్ట్రాంగ్ రూమ్‌కు తరలించకపోవడం దర్యాప్తును మరింత సంక్లిష్టం చేస్తోంది. ఈ క్రమంలో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు సమగ్ర విచారణకు ఆదేశించింది. కేవలం శబరిమల మాత్రమే కాకుండా ఆరన్ములలోని నాలుగు పవన్‌ల బంగారు హారం, తిరువనంతపురంలోని ఓ ఆలయానికి చెందిన వెండి వస్తువులు కూడా మాయమైనట్లు తనిఖీల్లో వెల్లడైంది. కిరీటం మిస్సింగ్ కాలేదని దేవస్థానం కమిషనర్ చెబుతున్నప్పటికీ, రికార్డుల్లోని వ్యత్యాసాలపై అధికారులు తీవ్రంగా పరిశోధిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

IPL 2027 వేలం ఇండియాలోనే.. గోవాలో మినీ ఆక్షన్‌!

సాటా ఆధ్వర్యంలో ఘనంగా 96వ సౌదీ నేషనల్ డే వేడుకలు

అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి

గుడ్‌ న్యూస్‌.. తగ్గనున్న వంటనూనె ధరలు

Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధర

Loading...
Unable to load recommendations.
Follow Us