ఈ ఆకుతో పచ్చడి చేసుకుని తింటే మోకాళ్ల నొప్పులు పరార్!
పునర్నవ ఆకులను తెల్ల గలిజేరు అని కూడా అంటారు. ఆయుర్వేదంలో ప్రాధాన్యత ఉన్న ఈ ఆకులతో రుచికరమైన పచ్చడి తయారు చేసుకోవచ్చు. ముందుగా ఆకులను శుభ్రంగా కడిగి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మినప్పప్పు వంటి దినుసులను వేయించాలి. అనంతరం ఆకులను 4–5 నిమిషాలు వేయించి, అన్ని పదార్థాలను కలిపి మెత్తగా రుబ్బితే పునర్నవ ఆకుల పచ్చడి సిద్ధమవుతుంది.
ఈ భూమి పైన మనకి తెలియనివి ఎన్నో మొక్కలలో అనేక ఔషధ గుణాలు నిండి ఉన్నాయి. వాటిలో పునర్నవ మొక్క ఒకటి . దీనినే తెల్ల గలిజేరు అని కూడా అంటారు.ఆయుర్వేదంలో ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీనికి ఆకు కూరగాకూడా వాడుకోవచ్చు. ఈ మొక్క ఆకులను పచ్చడి చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి మేలు చేస్తుందని పెద్దలు ఆహార నిపుణులు చెబుతారు. పునర్నవ ఆకుల పచ్చడి చేయడం చాలా ఈజీ. మనం రోజూ చేసుకునే పచ్చళ్లలాగే ఇదీ చేసుకోవచ్చు. రెండు కప్పుల పునర్నవ ఆకులు తీసుకుంటే.. నాలుగు పచ్చిమిర్చి, రెండు ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు , రెండు రెబ్బలు కరివేపాకు, కొద్దిగా చింతపండు , రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. ముందుగా పునర్నవ ఆకులను బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తరవాత స్టవ్ మీద పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేసి పచ్చడి కావలసిన దినుసులు అన్నీ నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసి పునర్నవ ఆకులను వేసి అవి వేగే వరకు కనీసం 4 నుంచి 5 నిమిషాల పాటు పచ్చివాసన పోయేదాకా వేయిస్తూ ఉండాలి. ఆకులు మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఆకులు బాగా వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులు, ఆకు, చింతపండు కలిపి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చివరిలో చిటికెడు ఇంగువతో తాలింపు పెట్టుకుంటే అదిరిపోతుంది. ఈ ఆకు ప్రధానంగా కిడ్నీ, కాలేయ సమస్యలను తగ్గించడానికి, శరీరంలో వాపులను నివారించడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. రక్తహీనతను తగ్గించడంలో మరియు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇది ఉపయోగపడుతుంది. ఆకలిని పెంచి, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. పునర్నవ ఆకులను పప్పులో వేసుకోవచ్చు..లేదంటే కూరగా కూడా వండుకొని తినవచ్చు. పునర్నవ ఆకులను నీటిలో మరిగించి కాషాయంగా తాగవచ్చు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పక వైద్యులను సంప్రదించడం మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందా? రవాణా శాఖ క్లారిటీ!
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..
విజయవాడ జంక్షన్‌లో రైళ్ల రద్దీకి చెక్.. రైల్వే బైపాస్ లైన్ నిర్మాణం
వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము.. అసలేం జరిగింది?
అయ్యో.. గుడ్లు అనుకొని గోల్ఫ్ బాల్స్ మింగేసిన పాము.. ఆ తర్వాత
