రాజకీయానికి కేరాఫ్ మారిన గూగుల్ డేటా సెంటర్

Updated on: Feb 13, 2026 | 12:47 PM

విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అంశం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. డేటా సెంటర్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను అదానీ సంస్థ చూసుకుంటుందని గూగుల్ లేఖ రాయడంతో సిపిఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, అదానీకి వేల కోట్ల రాయితీలు, విలువైన భూములు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని సిపిఎం ఆరోపిస్తోంది.

విశాఖపట్నం కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వ్యవహారం ప్రస్తుతం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను అదానీ సంస్థ చూసుకుంటుందని గూగుల్ రాసిన లేఖపై సిపిఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 1,36,000 కోట్ల పెట్టుబడితో ఒక గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ తో ఒప్పందం జరిగింది. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం అదానీ కంపెనీతో సమన్వయం చేసుకోవాలని గూగుల్ తన లేఖలో కోరింది. భూ యాజమాన్య హక్కులతోపాటు నిర్వహణను అదానీ కంపెనీకి అప్పగించాలన్న గూగుల్ ప్రతిపాదనలపై కేబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

MLA అరవ శ్రీధర్ – వీణ ఎపిసోడ్ లో కీలక పరిణామం

Botsa Satyanarayana: కూటమి వచ్చాక.. ఒక్క కొత్త పెన్షనూ లేదు

మల్లారెడ్డి యూనివర్సిటీలో శివరాత్రి జాగరణ కార్యక్రమం

Lok Sabha: లోక్ సభ లో.. జగడ జగడ జగడం

విడిపోయాకే సంతోషంగా ఉన్నా.. బాధ లేని బంధం