కొత్త కార్యాలయంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నూతన ప్రధాని కార్యాలయ సముదాయం సేవా తీర్థ్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకు బ్రిటిష్ కాలం నాటి సౌత్ బ్లాక్‌లో ఉన్న పీఎంఓ ఇప్పుడు ఈ అత్యాధునిక భవనంలోకి మారింది. "ప్రజలే దేవుళ్లు - పాలనే సేవ" అనే నినాదంతో, భారతీయుల పట్ల నిబద్ధతకు చిహ్నంగా దీనికి ‘సేవా తీర్థ్’ అని నామకరణం చేశారు.
నూతన కార్యాలయం నుంచి ప్రధాని మోదీ పలు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందిస్తూ ప్రాణాపాయం నుంచి రక్షించే వినూత్న పథకానికి ఆమోదం తెలిపారు. 2029 మార్చి నాటికి ‘లఖపతి దీదీల’ సంఖ్యను 6 కోట్లకు చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల రుణ పరిమితిని ₹2 లక్షల కోట్లకు పెంచారు. ₹10 వేల కోట్ల మూలధనంతో ‘స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0’కి ఆమోదం తెలిపారు. సుమారు ₹1200 కోట్లతో లార్సెన్ & టౌబ్రో (L&T) నిర్మించిన ఈ సముదాయం అత్యాధునిక హంగులతో అలరారుతోంది. పీఎంఓతో పాటు జాతీయ భద్రతా మండలి , క్యాబినెట్ సెక్రటేరియట్ అన్నీ ఒకే ప్రాంగణంలోకి వచ్చాయి. 4-స్టార్ GRIHA రేటింగ్‌తో పర్యావరణ హితంగా, స్మార్ట్ సెక్యూరిటీ, అత్యాధునిక కాన్ఫరెన్స్ హాల్స్‌తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దీనిని తీర్చిదిద్దారు. ఇది దేశ సేవలో తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని ఆకాంక్షించారు.
మరిన్ని వీడియోల కోసం :
రామ్ చరణ్, ఉపాసన కవలల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!
బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!
బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!
