మహారాష్ట్ర డిప్యూటీ CM అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండ్ అవుతుండగా క్రాష్ అయ్యింది. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కూలిన వెంటనే మంటలు చెలరేగగా, అజిత్ పవార్‌ను ఆసుపత్రికి తరలించారు. బహిరంగ సభకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ అయినట్టు సమాచారం. బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ల్యాండ్ అవుతున్న సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్టుగా తెలుస్తోంది. దీంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించగా, విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ఘటన గురించి తెలియగానే అజిత్ పవార్‌ను తక్షణమే ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నా బిడ్డ అమాయకుడు, ఆ మహిళే విలన్
అన్‌స్టాపబుల్‌గా షారుఖ్ సాంగ్.. 26ఏళ్లుగా ట్రెండింగ్‌లోనే
Animal: యానిమల్ పార్క్ అప్‌డేట్ ఇచ్చిన రణబీర్ కపూర్
రీజినల్ సినిమాలకే నేషనల్ రీచ్.. మారుతున్న బాక్స్ ఆఫీస్ ట్రెండ్స్
Sonal Chauhan: సడన్‌గా సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సోనాల్.. జోరు మామూలుగా లేదుగా
