MLA RK: కాంగ్రెస్‌లో చేరే మొదటి ఎమ్మెల్యే నేనే : ఆర్కే

Updated on: Jan 03, 2024 | 3:55 PM

వైఎస్‌ షర్మిల గురువారం కాంగ్రెస్‌లో చేరతారని తెలిపారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. మంగళగిరి నుంచి మళ్లీ పోటీ చేసే అంశంపై కాంగ్రెస్‌లో చేరిన తరువాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పార్టీలో తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఏపీ నుంచి కాంగ్రెస్‌లో చేరే మొదటి ఎమ్మెల్యేను తానే అని అన్నారు ఆర్కే.

వైఎస్‌ షర్మిల గురువారం కాంగ్రెస్‌లో చేరతారని తెలిపారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. మంగళగిరి నుంచి మళ్లీ పోటీ చేసే అంశంపై కాంగ్రెస్‌లో చేరిన తరువాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పార్టీలో తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఏపీ నుంచి కాంగ్రెస్‌లో చేరే మొదటి ఎమ్మెల్యేను తానే అని అన్నారు ఆర్కే. ఇంకా ఎంతమంది కాంగ్రెస్‌లో చేరతారనే విషయం తనకు తెలియదని అన్నారు. తన సోదరుడు వైసీపీలో ఉంటే తాను మరో పార్టీలో చేరకూడదని ఏమీ లేదని.. కుటుంబం వేరు, రాజకీయాలు వేరు అని ఆర్కే తెలిపారు. కుటుంబ బంధాలకు విలువ ఇస్తూనే.. రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Jan 03, 2024 03:53 PM
Loading...
Unable to load recommendations.
Follow Us