Vijay: హీరో విజయ్ పార్టీ సభ్యత్వంలో అప్పుడే లుకలుకలు !!

Updated on: Mar 14, 2024 | 12:35 PM

గత నెల ఫిబ్రవరిలో నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించారు . పార్టీలో కొత్త సభ్యత్వ నమోదుకు ఇటీవల శ్రీకారం కూడా చుట్టారు . 2026 అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా , తమిళనాడు రాజకీయాలలో మార్పు కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇందుకు ఒక యాప్ ను రూపొందించి దాని ద్వారా నూతన సభ్యత్వ నమోదుని ప్రారంభించారు. తన అభిమానులతో పాటు తమిళనాడు ప్రజలు తమ పార్టీ లో సభ్యులుగా చేరాలని విజ్ఞప్తి చేశారు.

గత నెల ఫిబ్రవరిలో నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించారు . పార్టీలో కొత్త సభ్యత్వ నమోదుకు ఇటీవల శ్రీకారం కూడా చుట్టారు . 2026 అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా , తమిళనాడు రాజకీయాలలో మార్పు కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇందుకు ఒక యాప్ ను రూపొందించి దాని ద్వారా నూతన సభ్యత్వ నమోదుని ప్రారంభించారు. తన అభిమానులతో పాటు తమిళనాడు ప్రజలు తమ పార్టీ లో సభ్యులుగా చేరాలని విజ్ఞప్తి చేశారు. విజయ్ పిలుపు తో నూతన సభ్యులు భారీగా తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ లో ప్రకటిస్తున్న నూతన పదవులపై వివాదం రాజుకుంది. నటుడు విజయ్ పార్టీ పై విమర్శలు మొదలయ్యాయి. పార్టీకి సంబంధించిన ముఖ్య పదవుల్ని అమ్ముకుంటున్నారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవులను సభ్యులు తమ బంధువులకి, తమ సన్నిహితులకి అమ్ముకుంటున్నారని నామక్కల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆరోపించారు. తక్షణమే పార్టీ అధ్యక్షుడు విజయ్ స్పందించాలన్నారు. నిజమైన కార్యకర్తలకు అవకాశమివ్వాలన్నారు. పదవులని అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vande Bharat: విశాఖకు కొత్తగా 2 వందే భారత్‌ రైళ్లు..

1200 ఏళ్లనాటి సమాధిలో బంగారం నిధి..

Poonam Kaur: గీతాంజలి మరణంపై నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్‌..

‘ఫ్రెండ్స్‌తో గడపాలని నా భర్త ఒత్తిడి చేశాడు’ స్టార్ హీరోయిన్ ఆవేదన

HanuMan: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో హనుమాన్ టీం..

Loading...
Unable to load recommendations.
Follow Us