Pawan Kalyan LIVE: సాగరతీరంలో పొలిటికల్ తుఫాన్.. పవన్ బస చేసిన హోటల్ వద్ద భారీ బందోబస్తు..(లైవ్)

|

Oct 16, 2022 | 10:07 AM

జనసేనాని పర్యటనకు భారీ జన సందోహం తరలివచ్చింది. రేపటి జనవాణి కార్యక్రమం నుంచి ప్రజలు, మీడియా దృష్టిని దారి మళ్లించేందుకే వైసీపీ ఇలాంటి కొత్త నాటకానికి తెర తీసింది.

ఏపీలోని విశాఖపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విశాఖ ఎయిర్‌పోర్ట్ దగ్గర జనసేన కార్యకర్తలు మంత్రుల కార్లపై దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురికి గాయాలవ్వడంతోపాటు.. వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో, విశాఖలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఓ వైపు రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన.. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన.. ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. విశాఖ గర్జన సభ అనంతరం.. మంత్రులు తిరుగుపయనమయ్యారు. ఇదే సమయంలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖకు చేరుకుంటుండటంతో… జనసైనికులు విమానాశ్రయం వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో మంత్రులు తిరిగి వెళుతుండగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Grandfather Marriage: తాత నువ్వు కేక..! తాతయ్య పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ.. అందుకే ఇప్పుడు ఐదో పెళ్లి..

Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్‌ బిల్ట్‌ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Published on: Oct 16, 2022 08:57 AM