Anchor Shyamala: యాంకర్‌ శ్యామల.. కొట్టేశారా ఛాన్స్

|

Sep 17, 2024 | 6:09 PM

స్టార్ యాంకర్ శ్యామల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు టీవీషోలకు యాంకర్ గా వ్యవహరించిన ఆమె సినిమాల్లోనూ మెరిశారు. అలాగే ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ లోనూ మెరిశారు. టీవీషోలు, సినిమాల సంగతి పక్కన పెడితే ఆమె రాజకీయాల్లోనూ యాక్టివ్ గా మారారు. శ్యామల, ఆమె భర్త నరసింహారెడ్డి 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు.

స్టార్ యాంకర్ శ్యామల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు టీవీషోలకు యాంకర్ గా వ్యవహరించిన ఆమె సినిమాల్లోనూ మెరిశారు. అలాగే ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ లోనూ మెరిశారు. టీవీషోలు, సినిమాల సంగతి పక్కన పెడితే ఆమె రాజకీయాల్లోనూ యాక్టివ్ గా మారారు. శ్యామల, ఆమె భర్త నరసింహారెడ్డి 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఇక కొన్ని నెలల క్రితం జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీ తరఫున చురుగ్గా ప్రచారం నిర్వహించారు శ్యామల. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలో నిలిచిన పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి గీతకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ ల పై సెటైర్లు వేసి వార్తల్లో నిలిచారు శ్యామల. ఈ కారణంగానే ఎన్నికల తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ ను ఎదుర్కొన్నారీ స్టార్ యాంకర్. అయితే ఆమె మాత్రం భయపడలేదు. ఎన్ని ఇబ్బందులొచ్చినా జగన్ వెంటే తన ప్రయాణం అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జగన్‌ కోసం శ్యామల పడిన కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం లభించింది. వైసీపీలో ఆమెకు జగన్‌ కీలక బాధ్యతలు అప్పగించారు అధినేత జగన్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోతి చేసిన పనికి ఇద్దరు ప్రాణాలు బలి !! అసలు ఏం జరిగిదంటే ??

Squid Game: స్క్విడ్‌ గేమ్‌.. హిందీ చిత్రం “లక్‌”కు కాపీనా ??

ట్రాన్స్‌జెండర్స్‌ సేవలతో ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయా ??

Follow us on