ఉగాదికి వేప పువ్వు దొరికేనా ?? వేపచెట్లకు ఏమైంది ??

Updated on: Mar 18, 2026 | 6:14 PM

ఈ ఉగాదికి వేపపువ్వు కరువవడంతో ఉగాది పచ్చడి తయారీపై ఆందోళన నెలకొంది. గత ఐదేళ్లుగా వేపచెట్లను పీడిస్తున్న వైరస్, ఫంగస్ తీవ్రరూపం దాల్చి చెట్లను ఎండిపోయేలా చేస్తోంది. వేపపువ్వుకు ప్రత్యామ్నాయంగా తులసి ఆకులను సూచిస్తున్నారు. ఈ ఆరోగ్య ప్రదాయిని వేప చెట్లను రక్షించడం మనందరి బాధ్యత.

ఉగాది పండుగ అంటే తెలుగువారికి ఎంతో ప్రధానమైన పండుగ. ఉగాదిరోజున షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ఉగాది పచ్చడిలో ప్రధానమైనది వేపపువ్వు. వేపపువ్వు లేనిదే ఉగాదిపచ్చడి ఉండదు. అలాంటిది ఈ ఏడాది ఉగాదికి వేపపువ్వు దొరికేలా కనిపించడంలేదు. గత ఐదేళ్లుగా వేప చెట్లను వేధిస్తున్న వింత వైరస్ ఈ ఏడాది తీవ్రరూపం దాల్చింది. దీంతో చెట్లు ఆకులు, కొమ్మలతో సహా ఎండిపోతున్నాయి. ప్రస్తుతం వేపచెట్లన్నీ పచ్చని చిగుళ్లతో.. తెల్లని వేపపూతతో నిండుగా దర్శనమివ్వాల్సింది పోయి ఎండిపోయి మోడువారి కనిపిస్తున్నాయి. దీంతో ప్రకృతి ప్రేమికులు, ఇటు భక్తులు ఆందోళన చెందుతున్నారు. వేప చెట్టును హిందూ సంప్రదాయంలో దైవస్వరూపంగా, సాక్షాత్తు గ్రామ దేవతగా పూజిస్తారు. అమూల్యమైన ఔషధ గుణాలున్న వేప చెట్లు ఇలా నిలువునా ఎండిపోతుండటాన్ని ప్రజలు ఏదో ‘కీడు సంకేతం’గా భావిస్తున్నారు. అయితే, వృక్ష శాస్త్రవేత్తలు దీనిని ఒక రకమైన ఫంగస్ లేదా వైరస్ వ్యాప్తిగా పేర్కొంటున్నారు. మార్చి 19న తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ జరుపుకోనున్న తరుణంలో, చెట్లకు వేప పువ్వు కనిపించకపోవడంతో పచ్చడి తయారీపై సందిగ్ధత నెలకొంది. జీవితంలోని కష్టాలకు ప్రతీకగా భావించే ‘చేదు’ రుచి కోసం వేప పువ్వుకు బదులుగా ఏం వాడాలనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు వేద పండితులు ‘తులసి ఆకులను’ ప్రత్యామ్నాయంగా సూచిస్తున్నారు. ఏది ఏమైనా, ఆక్సిజన్ అందించే ఆరోగ్య ప్రదాయిని వేప చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి.. వైరల్ వీడియో

గ్యాస్ వినియోగదారులకు బిగ్‌ రిలీఫ్‌.. ఈ విధంగా చేయండి

పాపం.. గోల్డ్‌ అనుకొని స్కెచ్‌ వేశారు.. చివరికి..

ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. చివరికి ఇలా..

పట్టపగలు దారుణం.. స్కూటీ డిక్కీ పగలగొట్టి నిమిషాల్లోనే

Follow Us