Hyderabad: హోంమంత్రి అమిత్ షాతో మైహోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు మర్యాదపూర్వక భేటీ..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం అనంతరం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌కు చేరుకున్న అమిత్ షాతో ప్రముఖ వ్యాపారవేత్త, మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు మర్యాదపూర్తకంగా భేటీ అయ్యారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. నగరానికి చేరుకున్న ఆయనకు బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన ఛార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం ఆయన నేరుగా బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌కు చేరుకున్నారు. హోటల్ ఐటీసీ కాకతీయలో ఏర్పాటు చేసిన లంచ్ మీట్‌లో పలువురు వ్యాపార, సినీ ప్రముఖులు అమిత్ షాతో భేటీ అయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త, మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు మర్యాదపూర్వకంగా అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత బీజేపీ మహాపాదయాత్రలో అమిత్ షా పాల్గొన్నారు.
Loading...
Unable to load recommendations.
Follow Us