Vizag RK Beach: జొవాద్ తుఫాన్ కారణంగా విశాఖపట్నంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆర్కే బీచ్‌లో సముద్రం ముందుకు దూసుకొచ్చింది. దీంతో బీచ్ వెంబడి భూమి కోతకు గురైంది. దుర్గాలమ్మ ఆలయం వరకు 200 మీటర్లు భూమి కోతకు గురవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.