Road accidents: ప్రాణదాతలకు 5 వేలు పారితోషికం.. కేంద్రం కొత్త పథకం..! వివరాలు ఇలా..(వీడియో)

|

Oct 09, 2021 | 9:12 PM

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సకాలంలో వైద్య చికిత్స అందించగలిగితే వారి ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుంది. అందుకే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు తొలి గంట చాలా కీలకం అని చెబుతారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సకాలంలో వైద్య చికిత్స అందించగలిగితే వారి ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుంది. అందుకే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు తొలి గంట చాలా కీలకం అని చెబుతారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను ఆదుకునేవారికి 5 వేల రూపాలయలు పారితోషికంగా ప్రకటిస్తూ ఓ కొత్త పథకాన్ని ప్రారంభించింది.

రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని గంటలోపు ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడేవారికి నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తామని తెలిపింది. ఈ పథకం అక్టోబరు 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఇందులో భాగంగా జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాణదాతలుగా నిలిచిన 10 మందికి లక్ష రూపాయల చొప్పున అందిస్తారు. ఈ పథకంలో భాగంగా…. ప్రమాదం గురించి పోలీసులకు మొట్టమొదట ఎవరైనా సమాచారం అందిస్తే, ఆ వివరాలను వైద్యులతో ధ్రువీకరించుకున్న అనంతరం పోలీసులు ఆ వ్యక్తికి ఓ రసీదు ఇస్తారు. ఆ రసీదు కాపీని జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పనిచేసే ఓ కమిటీకి పోలీసులే పంపిస్తారు. అలాకాకుండా, రోడ్డు ప్రమాద బాధితులను ఎవరైనా నేరుగా ఆసుపత్రికి తరలిస్తే, వారి పూర్తి వివరాలను ఆసుపత్రి వారే పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్రం తాజా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది.

మరిన్ని చదవండి ఇక్కడ : CVL Narasimha Rao on Maa Elections 2021: క్లైమాక్స్‌కు చేరుకున్న’మా’.. సీవీఎల్‌ నరసింహరావు మరో సంచలన నిర్ణయం..

 Pawan Kalyan-Janasena-Telangana: జై తెలంగాణ అంటూ ఊగిపోయిన పవన్ కళ్యాణ్.. క్రమశిక్షణకు మారుపేరుగా జనసేన..(లైవ్ వీడియో)

 Sharwanand-Siddharth-Maha Samudram: శర్వానంద్, సిద్ధార్థ్ భారీ బడ్జెట్‍ హై డ్రామా ‘మహా సముద్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (లైవ్ వీడియో)

 Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌పై పగబట్టిన వాన.. తడిసి ముద్దయిన భాగ్యనగరం.. (లైవ్ వీడియో)