‘వయసు’ పెరిగింది.. ‘మనసు’ మారింది!
ఒకప్పుడు 20 ఏళ్లు దాటగానే పెళ్లి సంబంధాల వేట మొదలయ్యేది. కానీ, ఇప్పుడు భారతీయ యువత ఆలోచనలు మారాయి. గత దశాబ్ద కాలంలో భారత్‌లో వివాహ సగటు వయసు 27 ఏళ్ల నుంచి 29 ఏళ్లకు పెరిగినట్లు ఓ ప్రముఖ మ్యాట్రిమోనీ సంస్థ నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం 50 శాతం మంది యువతీ యువకులు 29 ఏళ్ల వయసు వచ్చాకే తమ భాగస్వామి కోసం వెతకడం ప్రారంభిస్తున్నారు. తొందరగా పెళ్లి చేసుకోవడం కంటే ఆర్థిక సుస్థిరత, కెరీర్‌లో ఎదుగుదల మరియు వ్యక్తిగత సంసిద్ధతకే వారు పెద్దపీట వేస్తున్నారు. అంతేకాదు, వివాహ వ్యవస్థలో మరో కీలక మార్పు కూడా చోటుచేసుకుంది. అదేంటంటే.. పునర్వివాహాల పట్ల సమాజంలో ఉన్న అపోహలు తొలగిపోతున్నాయి. గడిచిన పదేళ్లలో పునర్వివాహం కోరుకునే వారి సంఖ్య ఏకంగా 43 శాతం పెరిగింది. ఇది విడాకుల పట్ల సామాజిక దృక్పథంలో వస్తున్న సానుకూల మార్పునకు నిదర్శనంగా చెప్పవచ్చు. కులం ప్రాధాన్యత కూడా గణనీయంగా తగ్గుతోంది. 2016లో 91 శాతం మంది కులం ముఖ్యం అనుకోగా, 2025 నాటికి అది 54 శాతానికి పడిపోయింది. అలాగే, తమ కంటే ఎక్కువ సంపాదన ఉన్న మహిళలను వివాహం చేసుకోవడానికి 87 శాతం మంది పురుషులు సిద్ధంగా ఉండటం విశేషం.
మరిన్ని వీడియోల కోసం :
రామ్ చరణ్, ఉపాసన కవలల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!
బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!
బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!