గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి పాస్ వచ్చేసింది.. రోజువారీ, నెలవారీ ధరలివే!

Updated on: Oct 04, 2026 | 9:46 PM

హైదరాబాద్‌ నగరవాసులకు మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి కామన్‌ పాస్‌ అందుబాటులోకి వచ్చింది. రోజువారీ పాస్‌ ధర రూ.400 కాగా, నెలవారీ పాస్‌ రూ.8,500గా నిర్ణయించారు. రూ.100 రిఫండబుల్‌ డిపాజిట్‌తో లభించే ఈ కార్డుతో మెట్రోతో పాటు ఓఆర్‌ఆర్‌ పరిధిలోని పుష్పక్‌ మినహా సిటీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. మరోవైపు ‘మీ టికెట్‌’ యాప్‌లో రూ.600 డిజిటల్‌ వీక్లీ బస్‌ పాస్‌ను కూడా ప్రవేశపెట్టారు.

హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ , హైదరాబాద్ మెట్రో రైల్ సంయుక్తంగా తీపికబురు అందించాయి. నగరంలో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు ‘కామన్ పాస్’ విధానాన్ని శుక్రవారం అధికారికంగా ప్రారంభించాయి. ఈ కొత్త విధానం ద్వారా ప్రయాణికులు ఇకపై ఒకే పాస్‌తో ఆర్టీసీ సిటీ బస్సుల్లో, మెట్రో రైళ్లలోనూ నిర్భయంగా ప్రయాణించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం నిత్యం లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు కొంత దూరం మెట్రోలో, మరికొంత దూరం బస్సులో ప్రయాణిస్తున్నారు. రెండు చోట్లా వేర్వేరుగా టికెట్లు, పాసులు తీసుకోవడం వల్ల సమయం వృథా అవ్వడంతో పాటు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా అధికారులు రోజువారీ, నెలవారీ ఉమ్మడి పాస్‌లను అందుబాటులోకి తెచ్చారు. రోజువారీ ఉమ్మడి పాస్ ధర రూ.400. ఈ పాస్‌తో ఒక రోజంతా మెట్రో, సిటీ బస్సుల్లో అపరిమితంగా ప్రయాణించవచ్చు. ఇక నెలవారీ పాస్ ధర రూ.8,500 గా నిర్ణయించారు. తొలిసారి కామన్ పాస్ కార్డు తీసుకునేటప్పుడు రూ.100 డిపాజిట్ చెల్లించాలి. కార్డును తిరిగి ఇచ్చినప్పుడు ఆ మొత్తం వెనక్కి ఇస్తారు. ఓఆర్ఆర్ లోపల నడిచే పుష్పక్ ఏసీ బస్సులు మినహా మిగతా అన్ని సిటీ బస్సుల్లో ఈ పాస్ చెల్లుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ‘మీ టికెట్’ అనే కొత్త మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించారు. దీని ద్వారా ప్రయాణికులే నేరుగా డిజిటల్ పద్ధతిలో ‘ఓపెన్ టికెటింగ్’ ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల బస్సుల్లో చిల్లర సమస్యకు శాశ్వతంగా తెరపడనుంది. అలాగే రూ.600 చెల్లించి వారం రోజుల పాటు అన్ని ఆర్టీసీ సిటీ బస్సుల్లో అపరిమితంగా ప్రయాణించేలా డిజిటల్ వీక్లీ బస్‌పాస్‌ను కూడా ఈ యాప్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఈ విప్లవాత్మక మార్పులు హైదరాబాద్ రవాణా వ్యవస్థను మరింత వేగవంతం చేస్తాయని అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రయాణికుడి దుస్సాహసం.. టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు యత్నం!

పంటను కాపాడుకోబోయి.. ప్రాణాలే కోల్పోయారు!

తెల్లవారితే పెళ్లి.. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చి వరుడితో ఏదో మాట్లాడింది.. ఉదయం చూసేసరికి వరుడు…

అమ్మబాబోయ్‌.. చిమ్మచీకట్లో గోడపై నక్కిన వింత ఆకారం!

Loading...
Unable to load recommendations.
Follow Us