గుండెపోటు.. ఆరోజే ఎందుకు వస్తోంది ?? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి ??
ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు అందర్నీ వెంటాడుతోంది. దీనిబారినపడి ప్రాణాలు దక్కించుకున్నవారి సంఖ్య చాలా తక్కువే. గుండెపోటు ప్రమాదం పెరగడానికి కారణాల గురించి పరిశీలిస్తే ఆసక్తికర అంశం వెల్లడైంది. జీవనశైలి సరిగా లేకపోవడం, జన్యు సంబంధిత సమస్యలు..
ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు అందర్నీ వెంటాడుతోంది. దీనిబారినపడి ప్రాణాలు దక్కించుకున్నవారి సంఖ్య చాలా తక్కువే. గుండెపోటు ప్రమాదం పెరగడానికి కారణాల గురించి పరిశీలిస్తే ఆసక్తికర అంశం వెల్లడైంది. జీవనశైలి సరిగా లేకపోవడం, జన్యు సంబంధిత సమస్యలు గుండెపోటుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అందుకే గుండెపోటు అనేది వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ వెంటాడుతోంది. ఇతర రోజులతో పోలిస్తే సోమవారం రోజే తీవ్రమైన గుండెపోటు కేసులు ఎక్కువగా సంభవించే అవకాశం ఉందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడయింది.సాధారణంగా సోమవారమే గుండెజబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదముందంటున్నారు పరిశోధకులు . స్టెమీ అనేది ఓ రకమైన గుండెపోటు. సాధారణ భాషలో చెప్పాలంటే గుండె రక్తనాళం వంద శాతం పూడుకుపోవడం వల్ల తలెత్తే సమస్య ఇది. ఈ పరిస్థితి తలెత్తడం తీవ్ర అనారోగ్యంతోపాటు ఒక్కోసారి మరణానికీ దారితీస్తుంది. దీనిపై ఐర్లాండ్ లోని బెల్ ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ కేర్ ట్రస్ట్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. 2013 నుండి 2018 వరకు జరిపిన అధ్యయనంలో 10,528 మంది పేషెంట్ల సమాచారాన్ని సేకరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బ్రిటిష్ కార్డియో వాస్క్యులర్ సొసైటీ కాన్ఫరెన్స్ లో పరిశోధకులు వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: ఫైనల్ ట్రైలర్ ఎఫెక్ట్ !! దిమ్మతిరిగే రెస్పాన్స్
Yash: రావణుడిగా.. కన్నడ సూపర్ స్టార్ యశ్..
అసలు మజా వచ్చే న్యూస్ ఇది.. ఏంటో తెలియాలి అంటే వీడియో చూసేయండి మరి
బస్సును చుట్టుముట్టిన పులులు.. అయినా తగ్గని డ్రైవర్
పుట్టిన మూడురోజులకే బోర్లా పడిన శిశువు.. ఆశ్చర్యపోయిన తల్లి, వీడియో రికార్డింగ్