Nithya Menon: నిత్యమీనన్ పై మాటల దాడి.. పగ తీర్చుకుంటున్న యూట్యూబర్.. పాపం నిత్యా..(వీడియో)

|

Aug 10, 2022 | 7:10 PM

ఆరేళ్లుగా నన్ను ఒకడు వేధిస్తున్నాడని నిత్యా మీనన్.. అలా చెప్పారో లేదో.. పొలోమని అప్పుడు మీడియా ముందుకు వచ్చిన ప్రభుద్దుడు సందీప్‌ వర్కీ.. మరో సారి నిత్య పై మాటల దాడికి పాల్పడ్డాడు...

ఆరేళ్లుగా నన్ను ఒకడు వేధిస్తున్నాడని నిత్యా మీనన్.. అలా చెప్పారో లేదో.. పొలోమని అప్పుడు మీడియా ముందుకు వచ్చిన ప్రభుద్దుడు సందీప్‌ వర్కీ.. మరో సారి నిత్య పై మాటల దాడికి పాల్పడ్డాడు. నిత్య పెళ్లి చేసుకుంటా అన్నా… నేను పెళ్లి చేసుకోను అంటూ అప్పుడు కామెంట్ చేసి… ఇప్పుడు మళ్లీ నిత్యపై దారుణంగా ట్రోల్స్ వచ్చేలా చేస్తున్నాడు.వైరల్ యూట్యూబర్‌ అయిన సందీప్ వర్కీ.. నిత్య కెరీర్ ఇనీషియల్ స్టేజ్‌లో ఇంటర్య్వూ పేరుతో పరిచయం ఏర్పరుచుకున్నారు. ఆ ఇంటర్య్వూ అయిపోగానే నిన్ను పెళ్లి చేసుకుంటా అంటూ.. నిత్యను వేధించడం షురూ చేశాడు. సర్లే పోనీలే కదాని నవ్వుకుని లైట్‌ తీసుకున్న నిత్యను.. ఆ తరువాత రకరకాల నెంబర్స్‌ నుంచి కాల్ చేస్తూ.. ఇబ్బంది పెట్టాడు.దాన్ని కూడా నిత్య.. లైట్ తీసుకున్నప్పటికీ… సందీప్ తన పేరెంట్స్ నెంబర్స్‌ కూడా ఫోన్ చేస్తూ… వేధిస్తుండడంతో… సీరియస్ అయ్యారు. తాజాగా తన లెటెస్ట్ మూవీ 19 (1) (A) ప్రమోషన్ ఇంటర్య్వూలో ఇతడి చేష్టలను గురించి చెప్పారు.దీంతో నిత్య చేసిన కామెంట్స్ పై రియాక్టైన సందీప్‌ వర్కీ…. నిత్య చెప్పిన మాటల్లో నిజంలేదంటూ బుకాయించాడు. నిత్య తల్లితండ్రులు తనపై లైంగిక వేధింపుల కేసు పెట్టాలని చూస్తున్నట్టు ఆరోపించాడు. అంతేకాదు గతంలో ఆమె అంటే ఇష్టం ఉండేదని.. పెళ్లి కూడా చేసుకోవాలని అనకున్నట్లు చెప్పాడు. కానీ ఇప్పుడు.. ఇంత జరిగాక చచ్చినా పెళ్లి చేసుకోను అంటూ.. వాగాడు. అయితే అంతా అయిపోయిందనుకున్న ఇష్యూను మరో సారి కదిలించారు వర్కీ. తన బండారం మొత్తం నిత్య బయట పెట్టడంతో… సోషల్ మీడియా వేదికగా ఆమెపై మాటల దాడి చేస్తున్నాడట. ఆమెను ట్రోల్ చేస్తూ పగతీర్చుకుంటున్నాడట. మరి వీటిపై నిత్య ఎలా రియాక్టవుతుందో చూడాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 10, 2022 07:10 PM