Toxic: మూడు రోజుల ముందే మొదలైపోయిన టాక్సిక్ మేనియా
‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’ ఆగస్టు 26న థియేటర్లలోకి రానుంది. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకుపోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు.
విడుదలకు మూడ్రోజుల ముందు నుంచే టాక్సిక్ మేనియా మొదలైపోయింది. అనుకున్న దానికంటే ఆలస్యమైంది కదా..? అంచనాలేమైనా తగ్గిపోతున్నాయేమో అనుకున్నారు కానీ అదే అంచనాలు, అదే ఆసక్తితో బాక్సాఫీస్ మీద దండెత్తడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ స్టార్. బుకింగ్స్‌లోనూ అప్పుడే ట్రెండ్ మొదలైపోయింది. మరి A సర్టిఫికెట్‌తో యశ్ ప్రయాణం ఎంత దూరం వెళ్లబోతుంది..? KGF తర్వాత యష్ నుంచి వస్తున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు మూడు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఆగస్టు 26న థియేటర్లలోకి రాబోతుంది సినిమా. ఈ మధ్యే IMDB సంస్థ ప్రకటించిన మోస్ట్ ఆంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుని టాప్ లేపింది టాక్సిక్. ఆ క్రేజ్ బుకింగ్స్‌లో కనిపిస్తుందిప్పుడు. గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లోనే తెరకెక్కించారు. ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. తమకు ఫ్యామిలీ ఆడియన్స్ అక్కర్లేదని.. పిల్లలు దూరంగా ఉంటే బెటర్ అంటూ ఏకంగా యశ్ క్లారిటీ ఇచ్చేసారు. కేజీఎఫ్ క్రేజ్ కంటిన్యూ చేస్తూ యష్ ఇందులోనూ గ్యాంగ్‌స్టర్‌గానే నటించారు యశ్. గోవా నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామా ఇది. 500 కోట్లతో KVN ప్రొడక్షన్స్‌తో కలిసి యశ్ ఈ సినిమాను నిర్మించారు. కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. 4 రోజుల ముందే బుకింగ్స్‌లో జోరు చూపిస్తుంది టాక్సిక్. మొత్తానికి ఆగస్టు 26న బాక్సాఫీస్ వద్ద యష్ మార్క్ విధ్వంసం చూడటానికి అభిమానులంతా కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price: పసిడి పరుగులు.. ఇవాళ తులం బంగారం ధర ఇదే!
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
ఎయిర్‌హోస్టెస్ నుంచి పోలీస్ ఆఫీసర్‌గా వచ్చింది.. అవినీతి ఊబిలో చిక్కుకొని..
2026 Lunar Eclipse: ఆగస్టు 28న ఆకాశంలో అద్భుతం.. భారత్‌లో కనిపిస్తుందా?
గంటల తరబడి మొబైల్ చూస్తున్నారా? మీ వెన్నెముకకు ముప్పు తప్పదు!