ఇంత ఈగో పనికారాదమ్మా.. యశ్ తల్లికి RGV కౌంటర్
యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమాకు ఆశించిన స్పందన రాకపోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ పెరిగాయి. ఈ నేపథ్యంలో గతంలో అల్లు అరవింద్ యశ్‌పై చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అయ్యాయి. తన కొడుకుపై వస్తున్న ట్రోలింగ్‌పై యశ్ తల్లి స్పందించగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా దీనిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినిమాలే నటులను స్టార్‌లుగా నిలబెడతాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన యశ్ టాక్సిక్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్‌లో కూడా దారుణంగా వెనక పడిపోయింది. అంతేకాదు ఈ సినిమాను యాక్సెప్ట్ చేసినందుకు.. యశ్‌ను దారుణంగా విమర్శిస్తున్నారు అందరూ…! సోషల్ మీడియాలోనూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ మధ్యలో గతంలో అల్లు అరవింద్ యశ్ గురించి చేసిన ఓ కామెంట్ నెట్టింట ఉన్నట్టుండి వైరల్ అయింది. ఇక ఇదంతా చూడలేకపోయిన యశ్ తల్లి.. కాస్త సీరియస్‌గా రియాక్టయ్యారు. తన కొడుకును వెనకేసుకొస్తూ ట్రోలర్స్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే ఈమె కామెంట్స్ పై ఇప్పుడు ఆర్జీవీ రియాక్టయ్యారు. యశ్ ను ఉద్దేశించి గతంలో అల్లు అరవిద్ చేసిన కామెంట్స్ లో తప్పేం లేదన్నాడు ఆర్జీవీ. అంతేకాదు కేజీఎఫ్ ముందు యశ్ ఎవరికీ తెలియదు. అలాగే బాహుబలి ముందు ప్రభాస్ ఎవ్వరనేది హిందీ ప్రేక్షకులకు తెలీదు. కాంతార ముందు రిషభ్ శెట్టి గురించి కూడా వారికి తెలీదు. అలానే నాకు ‘గాడ్ ఫాదర్’ ముందు మార్లన్ బ్రాండో గురించి తెలీదు. అంతకు ముందే వచ్చిన సినిమాలతో బ్రాండో స్టార్ అయ్యిండొచ్చు. కానీ అవి మన దేశంలో రిలీజయ్యాకే కదా.. మనకు అందులో నాకూ తెలిసింది అన్నాడు ఆర్జీవీ. సినిమాలు కొంద మందిని పెద్ద స్టార్లుగా చేస్తాయి తప్పితే.. పెద్ద స్టార్లు కావడం వల్ల ఆయా మూవీస్ పెద్దవి కావంటూ తన ట్వీట్ లో కోట్ చేశాడు ఆర్జీవీ. హాలీవుడ్‌లో సాధారణంగా స్టార్స్‌పై కాకుండా కాన్సెప్ట్‌లపై పెట్టుబడి పెడతారని. క్రిస్టోఫర్ నోలన్ లాంటి దర్శకులు కూడా నటుల స్టార్‌డమ్ మీద ఆధారపడకుండా, వారి నటనా సామార్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పేరున్న నటీనటులని ఎంపిక చేసుకుంటారని ఆర్జీవీ అన్నాడు. గతంలో యశ్ గురించి అల్లు అరవింద్ మంచి ఉద్దేశంతోనే మాట్లాడినప్పటికీ… యశ్ తల్లి ఈగోకు తీసుకున్నారేమో అంటూ ఇండైరెక్ట్‌గా తన ట్వీట్ లో రాసుకొచ్చారు ఆర్జీవీ. నిజానికి అలాంటి కామెంట్స్‌కి వచ్చిన స్పందనే వాళ్లు ఎలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నారో కూడా ఓ రకంగా అర్థమవుతోంది అంటూ ఫైనల్‌గా తన స్టైల్ ఆఫ్ స్టేట్మెంట్‌తో.. తన ట్వీట్ ను ఎండ్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Irumudi: 200 కోట్ల ఇరుముడి.. ప్రొడ్యూసర్‌కు మామూలు లాభాలు కాదు!
Jailer 2: విజయ్ ప్రభుత్వంపై జైలర్ డైలాగ్స్.. క్లారిటీ
TOP 9 ET News: “బాబాయ్ అంటే ఇంతే!” చరణ్ ఎమోషనల్.. బన్నీ క్రేజీ విష్
