డార్క్ థీమ్‌తో యశ్ జర్నీ… క్లిక్ అవుతుందా?
యష్ డార్క్, గ్రే షేడ్ పాత్రలను ఎంచుకుంటూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. టాక్సిక్, రామాయణం వంటి రాబోయే చిత్రాలలోనూ, గతంలో కేజీఎఫ్లోనూ ఇలాంటి ఛాయలున్న పాత్రలనే పోషించారు. ప్రతి నాయకుడిలోని గొప్పతనాన్ని ఎలివేట్ చేయడం, డార్క్ షేడ్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని ఆయన నమ్మకం. భవిష్యత్తులోనూ ఇటువంటి పాత్రలనే చేయనున్నట్లు తెలిపారు.
సినీ పరిశ్రమలో కథానాయకులు ఒకే తరహా జాన్రా చిత్రాలకు పరిమితం కాకుండా ఎప్పటికప్పుడు విభిన్న పాత్రలను పోషించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, తాను ఎన్ని సినిమాలు చేసినా, ఏ జాన్రా ఎంచుకున్నా తన పాత్రలో కావాల్సిన టింజ్ ఉందా లేదా అని చాలా సూక్ష్మంగా పరిశీలిస్తానని యష్ పేర్కొన్నారు.ప్రస్తుతం యష్ హీరోగా రెండు కాన్సెప్ట్‌లతో మూడు చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. వీటిలో టాక్సిక్ ఒకటి కాగా, రామాయణం రెండు భాగాలుగా రూపొందుతోంది. ఈ చిత్రాలన్నింటిలోనూ యష్ కొంత నెగిటివ్ టింజ్ ఉన్న రోల్స్‌లోనే కనిపిస్తున్నారు. గతంలో కేజీఎఫ్ చిత్రంలో రాకీ భాయ్ పాత్రలోనూ ఆయన ఇలాంటి ఛాయలనే ప్రదర్శించారు. ఇప్పుడు రామాయణంలో రావణుడి పాత్రను గ్లోరిఫై చేసే విధంగా స్క్రిప్ట్ సిద్ధం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు
ధురంధర్ జోరుకు బ్రేక్ వేసిందెవరు..?
క్లాస్ టు మాస్.. మాస్ టు క్లాస్ రూటు మారుస్తున్న టాప్ స్టార్స్
