ప్యాన్ ఇండియా హీరోలకు కొత్త ఫార్ములా ఇదేనా..?

Edited By:

Updated on: Jun 01, 2026 | 2:20 PM

ప్యాన్ ఇండియా సినిమాల్లో హీరోలు ఒకే పాత్రతో సరిపెట్టుకోవడం లేదు. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, బాలకృష్ణ, రణ్‌బీర్ కపూర్ వంటి స్టార్లు ఒకే సినిమాలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. భారీ కథలు, విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలు, ప్యాన్ వరల్డ్ మార్కెట్ లక్ష్యంగా ఈ కొత్త ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది.

ప్యాన్ ఇండియన్ సినిమాకు కొత్త రూల్ ఏమైనా పెట్టుకున్నారా..? ప్రతీ సినిమాలో కచ్చితంగా రెండు మూడు పాత్రలైనా చేయాలని హీరోలు కండీషన్ పెట్టారా..? ఒక్కటంటే ఏమో అనుకోవచ్చు కానీ ప్రతీ సినిమాలోనూ మనోళ్లు ఎందుకు రెండు మూడు డిఫెరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు..? ప్యాన్ ఇండియన్ మంత్రమా ఇది..? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా.. మహేష్ బాబు హీరోగా కెరీర్‌ మొదలుపెట్టి 26 ఏళ్లైపోయింది. అప్పుడెప్పుడో చైల్డ్ ఆర్టిస్టుగా ఉన్నపుడు కొడుకు దిద్దిన కాపురంలో తప్ప ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా డ్యూయల్ రోల్ చేయలేదు. అలాంటిది వారణాసి కోసం రెండు పాత్రలు చేస్తున్నారీయన. రుద్రగా నటిస్తూ.. రాముడిగానూ దర్శనమివ్వబోతున్నారు సూపర్ స్టార్. ప్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కోసం డిఫెరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. మహేష్ ఒక్కరే కాదు.. ప్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న హీరోలంతా విభిన్న పాత్రలు చేస్తున్నారు. అల్లు అర్జున్ ‘రాకా’ సినిమానే తీసుకోండి.. ఇందులో బన్నీ మూడు డిఫెరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో ఒకటి ఛాలెంజింగ్ రోల్.. అదే పోస్టర్‌లో రివీల్ చేసారు కూడా. ఈ మూడు పాత్రల కోసం ప్రాణం పెడుతున్నారు బన్నీ. కల్కిలో ప్రభాస్ కూడా అంతే. బాహుబలిలో డ్యూయల్ రోల్‌‌లో రప్ఫాడించిన రెబల్ స్టార్.. కల్కిలోనూ అదే రిపీట్ చేస్తున్నారు. ఇందులో భైరవగా రెగ్యులర్ హీరో పాత్ర చేస్తూనే.. కర్ణుడిగా అదరగొట్టారు. సెకండ్ పార్ట్‌లో కర్ణుడి క్యారెక్టర్ వెయిట్ పెంచేస్తున్నారు నాగ్ అశ్విన్. కల్కి 2 అంతా కర్ణుడు, కమల్ పోషిస్తున్న యస్కిన్ పాత్ర చుట్టే తిరుగుతుందని తెలుస్తుంది. బాలయ్యకు డ్యూయల్ రోల్ కొత్త కాదు.. తాజాగా కొరటాల సినిమాలోనూ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ప్యాన్ ఇండియన్ ప్రాజెక్టుగానే రాబోతుంది. అలాగే సందీప్ రెడ్డి వంగా యానిమల్ పార్క్ సినిమాలో రణ్‌బీర్ కపూర్ హీరో, విలన్‌గా రెండు పాత్రలు చేయబోతున్నారు. మొత్తానికి ప్యాన్ ఇండియన్ సినిమాల్లో హీరోలు మల్టిపుల్ క్యారెక్టర్స్ చేస్తూ కథ బరువు సోలోగానే మోస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిడ్డను కనండి.. రూ.64 లక్షలు అందుకోండి

ఇంటిపై భారీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ

ఉద్యోగాలన్నీ ఏఐ తీసేస్తుందా..? మనుషులను టెక్నాలజీ భర్తీ చేయలేదు!

అంతరిక్షంలో ‘రమ్’వాసన.. వింత మేఘాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

ఫిట్‌నెస్ ట్రెండ్..బరువు తగ్గడానికి ‘6-6-6 వాకింగ్ టెక్నిక్’

Follow Us