Toxic: టాక్సిక్‌ సాంగ్ విషయంలో వివాదం.. హీరోయిన్‌కు అండగా బ్రిటీష్‌ యాక్టర్‌

Edited By:

Updated on: Jul 19, 2026 | 11:32 AM

యష్, గీతూ మోహన్‌దాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'టాక్సిక్' సినిమా ప్రమోషన్స్ ప్రారంభమైనప్పటి నుంచి వరుస వివాదాల్లో నిలుస్తోంది. తొలి టీజర్‌లోని బోల్డ్ కంటెంట్ తర్వాత, ఫస్ట్ సింగిల్‌లో కియారా అద్వానీ గ్లామర్ లుక్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. దీనిపై చిత్ర బృందం స్పందిస్తూ ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించగా, ఆగస్టు 26 విడుదలకు సినిమా సిద్ధమవుతోంది.

టాక్సిక్ సినిమా ప్రమోషన్‌ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో వివాదం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా తొలి టీజర్‌ విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సెకండ్ టీజర్‌ ఒకే అనిపించినా… ఫస్ట్ సింగిల్‌తో మరోసారి చర్చ మొదలైంది. హీరోయిన్‌ కియారాను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా రచ్చ మొదలైంది. అసలు టాక్సి్క్ విషయంలో వివాదాలు కారణమేంటి..? ఈ కాంట్రవర్సీ మీద యూనిట్ రియాక్షన్ ఏంటి..? టాక్సిక్ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే వివాదాలు షురూ అయ్యాయి. తొలి టీజర్‌లో బోల్డ్ కంటెంట్‌తో షాక్‌ ఇచ్చిన మూవీ టీమ్, ఆ తరువాత కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తోంది. ‘ఏ ఫెయిరీ టేల్‌ ఫర్ గ్రోన్అప్స్’ అనే ట్యాగ్‌ లైన్‌తో వస్తున్న ఈ సినిమా కంటెంట్ విషయంలో ఓన్లీ ఫర్‌ అడల్ట్స్ అన్న వార్నింగ్ ఇస్తోంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ విషయంలో హీరోయిన్‌ కియారా మీద ట్రోల్స్‌ వైలర్ అవుతున్నాయి. పెళ్లి తరువాత కియారా ఇంత బోల్డ్‌గా నటించటం మీద సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో యూనిట్ సభ్యులు కియారాకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. అదే పాటలో నటించిన యష్‌కు కూడా పెళ్లైంది. కానీ ఆయనను హ్యాండ్సమ్‌ అని పొగుడుతూ కియారాను మాత్రమే ట్రోల్ చేయటం ఏంటి అంటూ ఫైర్ అయ్యారు నటుడు బెనెడిక్ట్‌. కేజీఎఫ్ 2 తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న యష్‌, ఏరి కోరి టాక్సిక్ సినిమాను సెలెక్ట్ చేసుకున్నారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహణ్‌దాస్ రూపొందిస్తున్న ఈ సినిమా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను ఇండియన్ లాంగ్వేజెస్‌తో పాటు ఇంగ్లీష్‌లోనూ భారీగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఢీ అంటున్న ప్రభాస్‌, బాలయ్య.. సై అనేదెవరు? సైడిచ్చేదెవరు?

OG 2: ఓజీ 2 సెట్స్ మీదకు వెళ్లేదెప్పుడు..? పవన్‌, సుజీత్‌ ప్లానింగ్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ రిలీజ్‌కు భారీ ఏర్పాట్లు.. 8000 థియేటర్లలో రిలీజ్‌

ప్రతి సినిమాకు కొత్త అవతారం… స్టార్ హీరోల మేకోవర్ వెనక భారీ కష్టం..!

Deepika Padukone: ప్రెగ్నెంట్‌గా ఉండి రిస్కీ స్టంట్స్‌.. దీపిక డెడికేషన్‌కు ఫిదా అవుతున్న ఇండస్ట్రీ

Follow Us