ఫారిన్‌ నుంచి ఫలక్‌నుమా దాకా.. టాలీవుడ్‌ను హైదరాబాద్ గల్లీలు ఎందుకు అంతగా ఆకట్టుకుంటున్నాయి?

Edited By:

Updated on: Aug 23, 2026 | 4:43 PM

ఇంటర్నేషనల్ మాఫియా, ఫారిన్ లొకేషన్లకు బదులుగా టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు హైదరాబాద్‌ గల్లీల వైపు మళ్లుతున్నాయి. ప్రభాస్ ‘స్పిరిట్’, నాని–శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ వంటి భారీ చిత్రాలు పక్కా లోకల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నాయి. హైదరాబాద్ సంస్కృతి, యాస, పాతబస్తీ వాతావరణం కథలకు కొత్త రియాలిటీని తీసుకొస్తుండటంతో సిటీ బ్యాక్‌డ్రాప్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.

ఒకప్పుడు ఇంటర్నేషనల్ మాఫియా, ఫారిన్ లొకేషన్ల చుట్టూ తిరిగిన పాన్ ఇండియా కెమెరాలన్నీ ఇప్పుడు భాగ్యనగరం గల్లీల్లోకి క్యూ కడుతున్నాయి. ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ నుంచి చిన్న సినిమాల వరకు అంతా పక్కా హైదరాబాదీ బ్యాక్‌డ్రాప్‌పై ఫోకస్ పెడుతున్నారు. టాలీవుడ్‌ కథల్లో బిర్యానీ ఫ్లేవర్ ఎక్కువగా కనిపిస్తుందిప్పుడు. ఉన్నట్లుండి సిటీ బ్యాక్‌డ్రాప్ సినిమాలకు డిమాండ్ ఎలా పెరిగింది..? హైదరాబాద్ నేపథ్యంలో సాగే కథలు చాలానే వచ్చాయి కానీ హైదరాబాదీ ఫ్లేవర్‌తో వచ్చిన సినిమాలు తక్కువే. ఆ మధ్య ఫలక్‌నుమా దాస్, ఈ నగారానికి ఏమైంది సినిమాలు అలాగే వచ్చాయి. ప్రేమలు లాంటి మలయాళం సినిమా కథంతా హైదరాబాద్‌లోనే జరుగుతుంది. తాజాగా ప్యాన్ ఇండియా కథలు కూడా సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సిద్ధమవుతున్నారు. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా కథ అంతా లోకల్ నేపథ్యంలో సాగుతుంది. ఈ విషయం చెప్పింది నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగే. ఇన్నాళ్లూ ఈ సినిమా కథ ఇంటర్నేషనల్ మాఫియా చుట్టూ తిరుగుతుందని అనుకున్నా.. అదేం కాదు ఇది పక్కా లోకల్ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ లోకల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.. గతంలో పోకిరి కూడా ఇలా సిటీ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగే పోలీస్ కథే. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ది ప్యారడైజ్ సినిమా కూడా పూర్తిగా హైదరాబాద్ నేపథ్యంలోనే సాగే కథ. దసరాను సింగరేణి నేపథ్యంలో తీసిన శ్రీకాంత్.. ఈసారి పక్కా పాతబస్తీ కథ రాసుకున్నారు. ఓల్డ్ సిటీ గల్లీ నుంచి వస్తున్న ఈ యాక్షన్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పెద్ద సినిమాలే కాదు.. ఈ మధ్య దీవానా, అమీర్ లోగ్ లాంటి సినిమాలు పూర్తిగా లోకల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చినవే.

Loading...
Unable to load recommendations.
Follow Us