Vijay Thalapathy: తండ్రి మీద కోపంతో.. ఇంటి పేరు మార్చుకున్న విజయ్‌ కొడుకు

Updated on: Mar 13, 2026 | 9:05 PM

సినిమాల్లో కింగ్ అయిన విజయ్ దళపతి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే, ఆయన వ్యక్తిగత జీవితంలో సంక్షోభం నెలకొంది. భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయగా, కొడుకు జాసన్ సంజయ్ తన తండ్రి ఇంటిపేరు (V) తొలగించి తల్లి ఇంటిపేరు (S) పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. దర్శకుడిగా అతని తొలి చిత్రం టైటిల్ కార్డులో ఈ మార్పు కనిపించడంతో కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సినిమాల్లో కింగ్‌గా.. నెంబర్ వన్‌గా ఉన్న విజయ్‌ దళపతి.. తన పొజీషన్‌ను వదులుకుని మరీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తమిళనాడులో తన అధికారాన్ని స్థాపించేందుకు.. ప్రజా సేవలో తన వైఖరి చూపించేందుకు తెగ కష్టపడుతున్నాడు. కానీ ఈ క్రమంలోనే తన ఇంట్లోనే విజయ్‌కు ఓ సమస్య ఎదురైంది. తన భార్య .. కోర్టుమెట్లెక్కి మరీ విడాకుల పిటిషన్ వేయడం.. ఆ పిటిషన్‌లో విజయ్‌పై పలు ఆరోపణలు చేయడం అంతటా సంచలనంగా మారింది. విజయ్‌ భార్య సంగీతకు తోడు.. కొడుకు జేసన్ సంజయ్‌ కూడా తండ్రి వైఖరి పై కోపంగా ఉన్నట్టు వార్తలు బయటికి వచ్చాయి. ఇక అవి నిజం అనేలా.. ఇప్పుడు జేసన్ తన ఇంటి పేరు మార్చుకున్నట్టు మరో న్యూస్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఇదివరకే సోషల్ మీడియాలో విజయ్ ను అన్ ఫాలో చేసిన జాసన్ సంజయ్.. ఇప్పుడు తన ఇంటి పేరును మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా తండ్రి ఇంటి పేరులోని మొదటి అక్షరాన్ని తమ పేరుకు ఇన్షియల్ గా ఉపయోగించడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు జాసన్ సంజయ్ మాత్రం ఇన్షియల్ పేరును మార్చినట్లు తెలుస్తోంది. తండ్రి విజయ్ పేరుతో వచ్చే V అక్షరాన్ని తొలగించి తన తల్లి సంగీత పేరులోని s అక్షరాన్ని పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హీరోగా కాకుండా జాసన్ సంజయ్ దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెడుతున్నారు. సిగ్మా అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అయితే ఈసినిమా టైటిల్ కార్డులో తన తండ్రి పేరుకు సంబంధించిన ఇన్షియల్ కాకుండా.. ఎస్ రావడం ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. ఓవైపు విజయ్ వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కాగా.. ఇప్పుడు దళపతికి తనయుడు సైతం దూరమవుతున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dhurandhar 02: కొండెక్కిన ధురంధర్ 2.. ప్రీమియర్ టికెట్ రేట్లు

Allu Arjun: బన్నీ సినిమా నుంచి అవాక్కయ్యే లాంటి అప్డేట్

Manoj: ఇక సాకులు చెప్పను.. మనోజ్ షాకింగ్ పోస్ట్

డ్యామేజ్ జరిగాక.. అసలు ముచ్చట చెబితే ఎట్టా

Mahesh Babu: అల్లు అర్జున్‌ లాగే వైజాగ్‌లో మహేష్ పెట్టుబడులు ??

Follow Us