Maharaja 2: మహారాజా సీక్వెల్‌.. సేతుపతి సిగ్నల్‌ ఇచ్చేసినట్టేనా

Edited By:

Updated on: Mar 20, 2026 | 8:02 PM

విజయ్ సేతుపతి తన కెరీర్ వేగాన్ని పెంచుతూ బ్యాక్-టు-బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. భారీ విజయం కోసం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న 'స్లమ్ డాగ్'తో పాటు, 'మహారాజ' సీక్వెల్ వంటి ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించారు. త్వరలో విడుదల కానున్న 'ట్రైన్', 'అరసన్' వంటి చిత్రాలతో ఆయన బ్లాక్‌బస్టర్ హిట్ లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.

స్పీడు పెంచుతున్నారు విజయ్‌ సేతుపతి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సంకల్పంతో ఉన్నారు మిస్టర్‌ సేతుపతి. ఆల్రెడీ బ్యాక్‌ టు బ్యాక్‌ మూవీస్‌ చేస్తున్న ఆయన, భారీగా సౌండ్‌ చేసే సక్సెస్‌ కోసం.. ఆల్రెడీ హిట్‌ అయిన ప్రాజెక్టునే లైన్లో పెడుతున్నారు. ఇంతకీ సేతుపతి ప్లానింగ్‌ ఎలా ఉంది? పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి చేస్తున్న స్లమ్‌ డాగ్‌ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. సంయుక్త మీనన్‌, టబు కీ రోల్స్ చేసిన ఈ సినిమా మీద మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్న పూరి జగన్నాథ్‌కి ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో కంబ్యాక్‌ సినిమా అవుతుందనే టాక్ ఉంది. లాస్ట్ ఇయర్‌ తలైవన్‌ తలైవితో డిఫరెంట్‌ రోల్‌ చేసిన విజయ్‌ సేతుపతి ఈ సినిమాతో కంప్లీట్‌ న్యూ అవతార్‌లో కనిపిస్తారని ఎగ్జయిట్‌ అవుతున్నారు ఫ్యాన్స్. లాస్ట్ ఇయర్‌ ఒకటికి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు విజయ్‌ సేతుపతి. ఏస్‌ మూవీ మన వారికి అంతగా కనెక్ట్ కాకపోయినా, తలైవన్‌ తలైవి మాత్రం తమిళ ఆడియన్స్ ని మెప్పించింది. శ్రుతి హాసన్‌తో కలిసి నటించిన ట్రైన్‌ కూడా లాస్ట్ ఇయరే విడుదల కావాల్సింది. కానీ, అనివార్య కారణాలతో వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. దీంతో పాటు అరసన్‌ కూడా ఈ ఏడాది సేతుపతి ఖాతాలో కనిపించనుంది. మణిరత్నం దర్శకత్వంలో శింబుతో కలిసి నవాబ్‌లో కనిపించారు సేతుపతి. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారు. మరో వైపు మహారాజ సీక్వెల్‌ కూడా టాక్స్ లో ఉంది. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్‌ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్‌. ఇప్పటికే దర్శకుడు కథ కూడా సిద్ధం చేశారని, త్వరలోనే ఫైనల్‌ నేరేషన్ వింటానని చెప్పారు సేతుపతి. సో.. వీటిలో ఏదో ఒక ప్రాజెక్ట్ తో సాలిడ్‌ హిట్‌ ఖాయం అంటున్నారు సేతుపతి ఫ్యాన్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Madhubala Biopic: సిల్వర్ స్క్రీన్ మీద మధుబాల బయోపిక్

చిన్న గింజలతో 7 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి

రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్‌ పేలడంతో..

మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!

Follow Us