Kaithi: కార్తి రిక్వెస్ట్ చేయడంతో.. హిట్టు సినిమా వదులుకున్న సేతుపతి

Kaithi: కార్తి రిక్వెస్ట్ చేయడంతో.. హిట్టు సినిమా వదులుకున్న సేతుపతి

Updated on: Nov 28, 2026 | 5:40 PM

ఖైదీ సినిమా కార్తి కెరీర్‌లో ఒక మైలురాయి. అయితే ఈ పాత్రకు కార్తి మొదటి ఎంపిక కాదని తాజాగా వెల్లడైంది. విజయ్ సేతుపతే మొదట ఖైదీ ఆఫర్ అందుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా, కార్తి వ్యక్తిగతంగా అడిగి ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు. సేతుపతి ఈ విషయాన్ని నిర్ధారిస్తూ, సినిమా విజయంపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఉన్నప్పటికీ, 2019లో వచ్చిన ఖైదీ సినిమా ఆయనకు ఎంతో ప్రత్యేకమైనది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్, కార్తికి స్టార్ హీరోగా బలమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఖైదీ సంచలన విజయం సాధించి, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం రికార్డు కలెక్షన్లు సాధించింది. కార్తి కెరీర్‌ను మలుపు తిప్పడమే కాకుండా, లోకేష్ కనకరాజ్‌కు తెలుగులో మంచి గుర్తింపును అందించిన సినిమా ఇది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)కి మూలం కూడా ఈ సినిమానే. అయితే, తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఖైదీ పాత్రకు కార్తి మొదటి ఎంపిక కాదట. ఈ సినిమా కోసం మొదట మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని అనుకున్నారట. కొన్ని కారణాల వల్ల సేతుపతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, కార్తికి అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని విజయ్ సేతుపతే స్వయంగా ఒక ఈవెంట్‌లో పంచుకున్నారు. కార్తి తనను ఫోన్ చేసి సినిమా చేయాలనుకుంటున్నానని అడిగారని, తాను అందుకు అంగీకరించానని సేతుపతి తెలిపారు. సినిమా విజయం సాధిస్తుందని తనకు ముందే తెలుసని, లోకేష్‌తో తనకున్న అనుబంధాన్ని, కార్తిపై ఉన్న గౌరవాన్ని కూడా ఆయన వివరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాకిస్థాన్‌ సిరీస్‌ ఇష్యూ..నెట్‌ఫ్లిక్స్‌కు భారత సినీ కార్మికుల హెచ్చరిక

అలియాస్ రుక్మిణీ ట్రైలర్.. నితిన్‌ను గట్టెక్కిస్తుందా..?

బంగారం కొంటున్నారా.. కక్కుర్తితో అలా చేస్తే మీ కొంప కొల్లేరే..!

ధురంధర్ బ్యూటీకి ఇన్నాళ్లకు మంచి ఆఫర్ వచ్చిందా..?

కాఫీ విత్ కరణ్ షోలో షాకింగ్‌ విషయాలు చెప్పిన అక్షయ్

Loading...
Unable to load recommendations.
Follow Us