లాలో – కృష్ణ సదా సహాయతే’ తెలుగు రీమేక్‌.. కృష్ణుడిగా చరణ్..? విజయ్..?

Updated on: Sep 08, 2026 | 12:39 PM

గుజరాతీ బ్లాక్‌బస్టర్ లాలో కృష్ణ సదా సహాయతే తెలుగు రీమేక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర ఎంతో కీలకం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు వినిపించినా, ప్రస్తుతం విజయ్ దేవరకొండ పేరు బలంగా ప్రచారంలో ఉంది. ఈ డివైన్ పాత్రలో విజయ్ ఒదిగిపోతాడా లేదా అనేది ఉత్కంఠగా మారింది.

వెండితెరపై దైవ పాత్రలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. గతంలో ఎన్టీఆర్ నుంచి నాగార్జున, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ శ్రీకృష్ణుడి పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు మరోసారి అలాంటి చర్చ తెరమీదికి వచ్చింది. గుజరాతీలో బ్లాక్ బస్టర్ అయిన లాలో కృష్ణ సదా సహాయతే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.2021లో కేవలం రూ. 50 లక్షల బడ్జెట్‌తో విడుదలై రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసి గుజరాతీ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం తెలుగు రీమేక్‌పై భారీ అంచనాలున్నాయి. ఒక ఆటో డ్రైవర్, శ్రీకృష్ణుడి మధ్య జరిగే అద్భుతమైన ప్రయాణమే ఈ సినిమా కథాంశం. తెలుగు రీమేక్‌లో శ్రీకృష్ణుడి పాత్ర ఎంతో కీలకం. ఈ పాత్ర కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు మొదట్లో గట్టిగా వినిపించింది. అయితే, తాజాగా యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ పేరు పరిశీలిస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి వంటి అగ్రెసివ్ పాత్రలతో యూత్‌ను ఆకట్టుకున్న విజయ్, డివైన్ కృష్ణుడి పాత్రలో ఎలా కనిపిస్తాడో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి.

మరిన్ని వీడియోల కోసం :

ముస్తాబైన ఖైరతాబాద్‌ గణపయ్య.. పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనం

పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది కింగ్ కోబ్రా

పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు..ఏఏ పత్రాలు కావాలో తెలుసా?

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, ఉరుములు,మెరుపుల బీభత్సం! ముప్పులో ఉత్తరాది రాష్ట్రాలు

ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు.. ఆదివారం అసలేం జరిగింది?

Loading...
Unable to load recommendations.
Follow Us