ఆ సంగీత దర్శకులకు స్పెషల్ క్రేజ్.. ఎందుకో తెలుసా

Edited By:

Updated on: Mar 28, 2026 | 11:25 AM

ప్రజెంట్ ట్రెండ్‌లో సినిమా విజయంలో సంగీత దర్శకుల పాత్ర కీలకమైంది. రిలీజ్‌కు ముందే సినిమాపై హైప్‌ పెంచడంలో సంగీతమే ప్రధాన భూమిక పోషిస్తోంది. కథకు న్యాయం చేయడంతో పాటు బజ్‌ క్రియేట్ చేయగలిగే అనిరుధ్, తమన్, దేవి శ్రీ ప్రసాద్ వంటి టాప్ సంగీత దర్శకులను మేకర్స్ ఎంచుకుంటున్నారు. వీరు తమ పాటలు, బీజీఎం, ఈవెంట్ పెర్ఫామెన్స్‌లతో సినిమా ప్రమోషన్లలో కూడా కీలక పాత్ర పోషిస్తూ, చిత్ర విజయాన్ని ప్రభావితం చేస్తున్నారు.

ప్రజెంట్ ట్రెండ్‌లో మ్యూజిక్‌ ఇంపార్టెన్స్ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా రిలీజ్‌కు ముందు సినిమా మీద హైప్‌ పెంచటంలో సంగీతమే కీ రోల్‌ ప్లే చేస్తోంది. అందుకే మేకర్స్ కూడా కథకు న్యాయం చేయటంతో పాటు సినిమా మీద బజ్‌ క్రియేట్‌ చేసే సత్తా ఉన్న సంగీత దర్శకులను ఏరి కోరి సెలెక్ట్ చేసుకుంటున్నారు. మరి ఈ రేసులో సూపర్ ఫామ్‌లో ఉన్న సంగీత దర్శకులెవరు..? ఈ స్టోరీలో చూద్దాం. ప్రజెంట్‌ సినిమా సక్సెస్‌లో సంగీత దర్శకులు కూడా కీ రోల్‌ ప్లే చేస్తున్నారు. ఆడియన్స్‌ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి కూడా డిస్కస్‌ చేసుకుంటున్నారు. అందుకే సంగీత దర్శకుల విషయంలో స్పెషల్‌ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్‌. సినిమా రేంజ్‌ పెంచే పేర్లు టైటిల్స్‌లో ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో అనిరుథ్ లాంటి వాళ్లకు భారీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. సినిమాకు మ్యూజిక్ చేయటం మాత్రమే కాదు, ఆ సినిమా ప్రమోషన్స్‌లోనూ కీ రోల్‌ ప్లే చేస్తున్న అనిరుధ్‌. రీసెంట్‌గా తన ఈవెంట్‌లో ది ప్యారడైజ్‌ సాంగ్ పాడిన అనిరుధ్‌ సినిమా మీద బజ్‌ను మరింత పెంచటంలో హెల్ప్ అయ్యారు. అదే తమిళ్‌లో అయితే ఆడియో రిలీజ్‌ ఫంక్షన్స్‌లో అనిరుధ్‌ పెర్ఫామెన్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తుంటారు. ఈ జోష్ సౌత్‌ సినిమాలకు చాలా హెల్ప్ అవుతోంది. పెద్ది విషయంలోనూ ఇదే జోరు హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. గతంలో హైదరాబాద్‌ ఈవెంట్‌లో చికిరి సాంగ్ పెర్ఫామ్ చేసిన రెహమాన్‌, రీసెంట్‌గా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్‌ టీమ్‌ లాంచింగ్ ఈవెంట్‌లోను రెహమాన్ సాంగ్ హైలెట్ అయ్యింది. దీంతో గ్లోబల్ రేంజ్‌లో ఈ సినిమా మీద బజ్‌ క్రియేట్ అయ్యింది. ఈ విషయంలో తెలుగు సంగీత దర్శకులు కూడా ముందే ఉన్నారు. తాను వర్క్ చేసే సినిమాల అప్‌డేట్స్ విషయంలో యాక్టివ్‌గా ఉంటున్నారు తమన్‌. రీసెంట్‌గా గద్దర్ అవార్డ్స్‌లో పెర్ఫామ్ చేసిన దేవీ శ్రీ ప్రసాద్‌ కూడా తన నటిస్తూ సంగీతమందిస్తున్న ఎల్లమ్మ సినిమా బీట్‌ను పెర్ఫామ్ చేసి చూపించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి ధర.. ఎంతంటే!

యూట్యూబ్‌ను ఊపేస్తున్న ‘కోసింది కొయగూర’ సాంగ్

Lokesh Kanagaraj: లోకేష్‌ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్

‘ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు..’ చేతులు జోడించి మరీ యాంకర్ ఎమోషనల్ !!

ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా

Follow Us