యంగ్ డైరెక్టర్లను వెంటాడుతున్న ‘ద్వితీయ విఘ్నం’
తొలి సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకులకు రెండో సినిమా పెద్ద సవాల్‌గా మారుతోంది. టాలీవుడ్‌లో దీనినే ‘ద్వితీయ విఘ్నం’ అనే సెంటిమెంట్‌గా చెబుతున్నారు. అజయ్ భూపతి, వేణు ఉడుగుల, రాధాకృష్ణ కుమార్ వంటి దర్శకులు రెండో సినిమాతో తడబడ్డారని కథనం పేర్కొంటోంది. మరోవైపు ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా, బుచ్చిబాబు రెండో సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటారు. ఇప్పుడు ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలపై ఆసక్తి పెరిగింది.
టాలీవుడ్‌లో యంగ్ డైరెక్టర్లను టెన్షన్ పెడుతున్న సెంటిమెంట్ ‘ద్వితీయ విఘ్నం’. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన కొందరు డైరెక్టర్లు రెండో సినిమాతో బోల్తా కొడితే.. మరికొందరు మాత్రం పాన్ ఇండియా రేంజ్‌లో రికార్డులు క్రియేట్ చేశారు. ఇప్పుడు ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల తన సెకండ్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’తో ఏ లిస్ట్‌లో చేరుతారనేది ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్.. ఇండస్ట్రీలో తొలి సినిమా హిట్ అయితే ఆ డైరెక్టర్‌కు వచ్చే క్రేజే వేరు. కానీ అసలు టెన్షన్ అంతా రెండో సినిమాతోనే మొదలవుతుంది. ఇండస్ట్రీలో చాలా కాలంగా యంగ్ డైరెక్టర్లను వెంటాడుతున్న సెంటిమెంట్ ‘ద్వితీయ విఘ్నం’. మొదటి సినిమాతో అంచనాలు అమాంతం పెంచేసి, ఆ తర్వాత రెండో సినిమాతో ఆ అంచనాలను అందుకోలేక చతికిలపడిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. 90స్ సిరీస్‌లో మెప్పించిన ఆదిత్య హాసన్ ఆ కాన్సెప్ట్‌ను కంటిన్యూ చేస్తూ రూపొందించిన ఎపిక్ మూవీతో ఆ స్థాయిలో మెప్పించలేకపోయారు. అజయ్ భూపతి, వేణు ఉడుగుల, రాధాకృష్ణ కుమార్ కూడా ఈ సెంటిమెంట్ బారిన పడ్డవారే. ఫస్ట్ ప్రాజెక్ట్‌తో మ్యాజిక్ చేసిన వీళ్లంతా రెండో అడుగులో తడబడ్డారు. ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా, బుచ్చిబాబు లాంటి దర్శకులు రెండో సినిమాతో పాన్ ఇండియా మార్కెట్‌ను షేక్ చేసి కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఇదే పాయింట్ నేచురల్ స్టార్ అభిమానులను టెన్షన్ పెడుతోంది. ‘దసరా’ లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల.. నానితోనే ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్నారు. మరి శ్రీకాంత్ ఓదెల ద్వితీయ విఘ్నాన్ని ఎలా హ్యండిల్ చేస్తారో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలీవుడ్‌లో మైథలాజికల్ జాతర.. దేవుళ్ల కథల్లో స్టార్ హీరోలు!
గ్లామర్ నుంచి బయోపిక్స్‌కు.. స్టార్ హీరోయిన్ల కొత్త రూట్!
Gold Price Today: బంగారం నేల చూపులు…ఈరోజు తులం గోల్డ్ ధర ఎంతంటే!
పండుగ పూట నిండుగా వానలు.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన ఖరీఫ్ టెన్షన్ తొలగిపోయినట్లేనా?
USలో భారత విద్యార్థులకు ఉపశమనం.. ట్రంప్ నిర్ణయానికి కోర్టు బ్రేక్
