ఒక్క హిట్ చాలు..! స్టార్ హీరోల క్యూ అంతా ఆ దర్శకుల కోసమే

Edited By:

Updated on: Jun 01, 2026 | 1:36 PM

టాలీవుడ్‌లో ప్రస్తుతం రిపీట్ కాంబినేషన్స్ హవా కొనసాగుతోంది. హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. చిరంజీవి-బాబీ, బాలకృష్ణ-గోపీచంద్ మలినేని, వెంకటేష్-అనిల్ రావిపూడి, ప్రభాస్-నాగ్ అశ్విన్, ఎన్టీఆర్-త్రివిక్రమ్ వంటి విజయవంతమైన కాంబినేషన్స్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టులపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

హిట్ ఇచ్చిన దర్శకుడిని ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి..? ఇహనో ఇప్పుడో అంటూ మళ్లీ మళ్లీ కలిసి సినిమాలు చేయాలనుకుంటారు. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఇలాంటి రిపీట్ కాంబినేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా సీనియర్ హీరోలైతే కళ్లు మూసుకుని హిట్ ఇచ్చిన దర్శకులను క్యూలో పెట్టేసారు. మరి ఏంటా రిపీట్ కాంబోస్..? టాలీవుడ్‌లోనే కాదు.. ఇండస్ట్రీ ఏదైనా రిపీట్ కాంబినేషన్స్‌కు ఉండే క్రేజే వేరు. ఆల్రెడీ హిట్ ఇచ్చిన వాళ్లు కలిసి పని చేస్తున్నారంటే వద్దన్నా ఆ సినిమా మార్కెట్ పెరుగుతుంది. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు రిపీట్ కాంబోస్ మీదే ఫోకస్ చేసారు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీతో చిరు మరో సినిమా చేస్తుంటే.. వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు బాలయ్య. గోపీచంద్ మలినేనితో అదిరిపోయే మాస్ సినిమా చేస్తున్నారు నటసింహం. ఈ చిత్ర షూటింగ్ ముంబైలో జరుగుతుందిప్పుడు. ఇందులో మాఫియా డాన్‌గా నటిస్తున్నారు బాలయ్య. వెంకటేష్ సైతం అనిల్ రావిపూడితో మరో సినిమా చేస్తున్నారు. ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారు తర్వాత ఈ కాంబోలో వస్తున్న ఐదో సినిమా ఇది. వెంకీ, అనిల్ కాంబినేషన్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్‌కు పండగ.. అందుకే వచ్చే సంక్రాంతిని కూడా వీళ్లే కబ్జా చేస్తున్నారు. పైగా ఇదే సినిమాలో పదేళ్ళ తర్వాత కళ్యాణ్ రామ్‌తో కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు అనిల్. తొలి సినిమా ‘పటాస్’ హీరోతో దశాబ్ధం తర్వాత పని చేయడం ఆనందంగా ఉందంటున్నారు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. ప్రభాస్ కూడా కల్కి 2 కోసం నాగ్ అశ్విన్‌తో మరోసారి జోడీ కట్టారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది.. దాంతోపాటు 2027లో సలార్ 2తో ప్రశాంత్ నీల్ రేసులోకి రానున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్‌తో గాడ్ ఆఫ్ వార్ సినిమా చేయబోతున్నారు. అరవింద సమేత తర్వాత ఈ కాంబినేషన్‌లో రాబోతున్న మరో పవర్ ఫుల్ సినిమా ఇది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిడ్డను కనండి.. రూ.64 లక్షలు అందుకోండి

ఇంటిపై భారీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ

ఉద్యోగాలన్నీ ఏఐ తీసేస్తుందా..? మనుషులను టెక్నాలజీ భర్తీ చేయలేదు!

అంతరిక్షంలో ‘రమ్’వాసన.. వింత మేఘాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

ఫిట్‌నెస్ ట్రెండ్..బరువు తగ్గడానికి ‘6-6-6 వాకింగ్ టెక్నిక్’

Follow Us