Mafia: టాలీవుడ్‌లో పెరిగిపోతున్న మాఫియా.. స్టార్ హీరోలందరూ డాన్ అవతారమే ఎందుకు ఎత్తుతున్నారు?

Edited By:

Updated on: May 30, 2026 | 3:14 PM

టాలీవుడ్‌లో మాఫియా, గ్యాంగ్‌స్టర్ కథలకు మళ్లీ క్రేజ్ పెరుగుతోంది. Chiranjeevi, Nandamuri Balakrishna, Akkineni Nagarjuna, N. T. Rama Rao Jr., Nani వంటి స్టార్ హీరోలు వరుసగా మాఫియా బ్యాక్‌డ్రాప్ కథలపై ఆసక్తి చూపిస్తున్నారు. భారీ యాక్షన్, ఎమోషన్స్, పవర్‌ఫుల్ పాత్రల కారణంగా ఈ జానర్‌కు మళ్లీ డిమాండ్ పెరిగినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.

టాలీవుడ్‌లో పెద్ద మాఫియానే నడుస్తుంది. మాఫియా అంటే మీరు అనుకునేది కాదు.. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు చెప్పినట్లు ఇది అదోరకం అన్నమాట. తెరవెనక మాఫియా కాదు ఇది తెరపై మాఫియా గురించి మన టాపిక్ అన్నమాట. హీరో ఎవరైనా.. గ్యాంగ్ స్టర్ డ్రామాల వైపే అడుగులేస్తున్నారు. ఉన్నట్లుండి ఈ మాఫియా కథలకు డిమాండ్ ఎందుకొచ్చింది..? తెలుగు ఇండస్ట్రీలో మాఫియా, గ్యాంగ్ స్టర్ కథలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ప్రతీ హీరో కనీసం ఒక్కసారైనా కెరీర్‌లో డాన్‌గా మారుతుంటారు. గతేడాది పవన్ కూడా ఓజితో మ్యాజిక్ చేసారు. త్వరలోనే పార్ట్ 2 కూడా రెడీ అవుతుంది. మరోవైపు చిరంజీవి కూడా బాబీ సినిమాలో డాన్‌గానే కనిపించబోతున్నారు. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో రానుంది ఈ చిత్రం. మూడేళ్ళ కింద వచ్చిన వాల్తేరు వీరయ్యలో కూడా మాఫియా బ్యాక్‌డ్రాప్ ఉంటుంది కానీ కథలో అది ఓ భాగం మాత్రమే. కానీ ఇప్పుడు మెగా 158లో చిరు పూర్తిగా మాఫియా డాన్‌గానే కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అనస్వర రాజన్ ఇందులో చిరు కూతురుగా నటిస్తున్నారు. మరోవైపు గోపీచంద్ మలినేని సినిమాలో బాలయ్య సైతం ముంబై బేస్డ్ డాన్‌గా కనిపిస్తున్నారు. గతంలో రానా, అశోక చక్రవర్తి, డిక్టేటర్ లాంటి సినిమాల్లో మాఫియా డాన్‌గా నటించారు బాలయ్య. చాలా ఏళ్ళ తర్వాత మరోసారి మాఫియా వైపు లుక్ వేస్తున్నారీయన. నాగార్జున 100వ సినిమా కూడా మాఫియా బ్యాక్‌డ్రాప్‌‌లోనే వస్తుంది. రా.కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. గతంలో డాన్, భాయ్ సినిమాల్లో మాఫియా లీడర్‌గా నటించారు నాగార్జున. సీనియర్లే కాదు.. జూనియర్స్ కూడా మాఫియా దారిలోనే వెళ్తున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న డ్రాగన్ సినిమాలో ఇంటర్నేషనల్ మాఫియా డాన్‌గా నటిస్తున్నారు తారక్. హెరాయిన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ రాసుకున్నారు నీల్. అలాగే ఓజి తర్వాత సుజీత్ చేస్తున్న బ్లడీ రోమియోలో నాని గ్యాంగ్ స్టర్‌గా నటించబోతున్నారు. మొత్తానికి టాలీవుడ్‌ను మాఫియా రూల్ చేస్తుందిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బార్‌లో బీరు సీసాలతో రచ్చ.. తల పగిలినా కూల్‌గా ‘లాస్ట్ పెగ్’ వేసి

Jio: జియో బంపర్‌ ఆఫర్‌..కేవలం రూ.200కే అన్నీ..!

ఉద్యోగం పోయిందని సంబరాలు.. “ఇప్పుడే నా జీవితం మొదలైంది” అంటున్న యువతి

మార్స్ లో మనుషులు జీవించడానికి మొదటి అడుగు!

మృత్యువు ఇలా కూడా వస్తుందా..! భోజనం చేస్తుండగానే

Published on: May 30, 2026 02:55 PM
Follow Us