ఆల్ రౌండర్స్ అయిపోతున్న హీరోయిన్లు.. సినిమాల్లో సత్తా చాటుతున్న బ్యూటీస్

Edited By:

Updated on: Mar 23, 2026 | 7:38 PM

ఒకప్పుడు హీరోయిన్లు గ్లామర్, నటన, స్పెషల్ సాంగ్స్‌కు పరిమితం కాకుండా, ఇప్పుడు టాలీవుడ్‌లో ఆల్ రౌండర్స్‌గా సత్తా చాటుతున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల, రష్మిక మందన్న, మమిత బైజు వంటి నటీమణులు కమర్షియల్ సినిమాలతో పాటు ఫీమేల్ సెంట్రిక్ రోల్స్, స్పెషల్ సాంగ్స్‌లోనూ రాణిస్తూ మల్టీ టాలెంటెడ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్‌లో ఎవరు ఎలా దూసుకుపోతున్నారో చూడండి.

ఒకప్పుడు గ్లామర్‌కు ఒకరు, యాక్టింగ్‌కు మరొకరు, స్పెషల్ సాంగ్స్ కోసం ఇంకొకరు.. ఇలా హీరోయిన్లకో లెక్క ఉండేది. కానీ ట్రెండ్ మారిందిప్పుడు. మన హీరోయిన్స్ ఆల్ రౌండర్స్‌గా మారిపోయి కమర్షియల్ సినిమాలతో పాటు ఫీమేల్ సెంట్రిక్ రోల్స్, స్పెషల్ సాంగ్స్‌లోనూ అదరగొడుతూ మల్టీ టాలెంటెడ్ ఇమేజ్ క్యారీ చేస్తున్నారు.. అలా టాలీవుడ్‌ను ఏలుతున్న ఆల్ రౌండర్ బ్యూటీస్ ఎవరో చూద్దాం రండి..! ప్రేమలు, డ్యూడ్‌లతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న మమిత బైజు.. సూర్య హీరోగా నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్‌లో గ్లామర్ షోతోనూ కుర్రకారును ఫిదా చేసారు. టీజర్ అంతా ఈమె రచ్చే కనిపించింది. పూజా హెగ్డే గ్లామర్‌తో పాటు రెట్రో సినిమాలో నటిగా ఆకట్టుకున్నారు.. రంగస్థలం, ఎఫ్ 3 లాంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్ చేసి తనలోని ఆల్ రౌండర్ యాంగిల్‌ను ఏనాడో ప్రూవ్ చేసుకున్నారు. టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్, గ్లామర్ డాల్‌ ఇమేజ్ సంపాదించుకున్న శ్రీలీల.. అప్పుడప్పుడూ తనలోని నటనకు పని చెప్తుంటారు. భగవంత్ కేసరి, పరాశక్తి లాంటి సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్‌లో అదే చేసారు. ఇక కిస్ కిస్ కిసిక్ అంటూ పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేసి దేశం మొత్తాన్ని ఊపేసారు. కెరీర్ స్టార్టింగ్‌లో గ్లామర్ షోతో అదరగొట్టిన రష్మిక మందన్న.. కొన్నాళ్లుగా యానిమల్, ఛావా లాంటి పాన్ ఇండియా సినిమాలతో నటిగా తన విశ్వరూపం చూపించారు. గర్ల్ ఫ్రెండ్ సినిమాతో అవార్డులు గెలుచుకున్నారు. ఫీమేల్ సెంట్రిక్ స్టార్‌గానూ మారిపోయారు. మొత్తానికి మన హీరోయిన్స్ అంతా ఆల్ రౌండర్స్‌గా సత్తా చూపిస్తున్నారిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హిట్టు కొట్టు గురూ.. లేకపోతే అంతే సంగతులు.. కుర్ర హీరోలకు అల్టిమేటం

పాన్ ఇండియన్ సినిమాలకు సౌత్ బ్యూటీస్ పనికిరారా..?

యంగ్ హీరోలకు అసలైన అగ్నిపరీక్ష

పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??

Allu Arjun: ఏ స్టార్ హీరోకి సాధ్యం కానిది.. అల్లు అర్జున్ మాత్రమే ఎలా సాధ్యం

Follow Us