టాలీవుడ్‌లో యాక్షన్ లవ్ స్టోరీల ట్రెండ్

Updated on: Jul 20, 2026 | 4:08 PM

టాలీవుడ్‌లో యాక్షన్ లవ్ స్టోరీల ట్రెండ్ ఇప్పుడు ఒక బలమైన ప్రవాహంగా మారింది. క్లాస్‌గా ప్రేమను చెబుతూనే, మాస్ యాక్షన్‌తో యువ హీరోలు థియేటర్లను షేక్ చేస్తున్నారు. ఈ జోనర్‌లోని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయాలు సాధిస్తూ, పరిశ్రమలో కొత్త సూత్రాన్ని నెలకొల్పుతున్నాయి. అడవిశేష్ నటించిన డెకాయిట్, లెనిన్ వంటి చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. శ్రీనివాస మంగాపురం, ఫౌజీ వంటి రాబోయే ప్రాజెక్టులపై భారీ అంచనాలున్నాయి

టాలీవుడ్‌లో రొమాన్స్‌తో పాటు యాక్షన్ లవ్ స్టోరీల ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. ఒకవైపు క్లాస్‌గా ప్రేమ కథని చెబుతూనే, మరోవైపు మాస్ యాక్షన్‌తో కుర్ర హీరోలు థియేటర్లని షేక్ చేస్తున్నారు. వరుసగా ఈ జోనర్‌లో వస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్లు సాధిస్తూ ఉండటంతో, ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఇదే ఫార్ములాని జపిస్తోందా అన్న చర్చ జరుగుతోంది. ఈ యాక్షన్ ప్రేమకథల ట్రెండ్ పై మనము ఓ లుక్కేద్దాం.ఈ మధ్యకాలంలో వచ్చిన యాక్షన్ లవ్ స్టోరీలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లతో అదరగొడుతూ సత్తా చాటుతున్నాయి. విభిన్నమైన కథతో వచ్చిన అడవిశేష్ హీరోగా చేసిన డెకాయిట్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని పర్వాలేదు అనిపించుకుంది. అదే ఊపులో థియేటర్లలోకి వచ్చిన లెనిన్ సినిమా కూడా యాక్షన్ తో పాటు ప్రేమను పంచుతూ చాలా బాగా ఆడుతోంది. ఇప్పటికే వచ్చిన సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో రాబోయే ప్రాజెక్టుల మీద కూడా ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ క్రమంలోనే ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటిస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమా సరిగ్గా ఇదే యాక్షన్ లవ్ స్టోరీ జోనర్‌లో రాబోతోంది.

Follow Us