TOP9 ET: కల్కి Vs యానిమల్ నాగి షాకింగ్ ట్వీట్ | బాక్సాఫీస్ కు ఒక్కడే రాజు.. అతడే ప్రభాస్ రాజు

TOP9 ET: కల్కి Vs యానిమల్ నాగి షాకింగ్ ట్వీట్ | బాక్సాఫీస్ కు ఒక్కడే రాజు.. అతడే ప్రభాస్ రాజు

Anil kumar poka

|

Updated on: Jul 18, 2024 | 8:21 AM

రామ్ పోతినేని హీరోగా.. పూరీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ డబుల్ ఇస్మార్ట్. ఇక రీసెంట్‌గా ఈ మూవీ నుంచి మార్ ముంతా ఛోడ్‌ చింతా సాంగ్‌ను రిలీజ్ చేసిన మేకర్స్ చిక్కుల్లో పడ్డారు. బీఆర్ ఎస్ పార్టీ శ్రేణులకు కోపానికి గురయ్యారు. తమ పాటలో మాజీ సీఎం కేసీఆర్ ఏం జేద్దమంటవు అని ఓ స్పీచ్లో చెప్పిన డైలాగ్‌ను .. పాట మధ్యలో వాడేశారు. అయితే ఐటెం సాంగ్లో కేసీఆర్ లాంటి వ్యక్తి చెప్పిన మాటను వాడటాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుబడుతున్నారు.

01. nag: కల్కి VS యానిమల్.. నాగి షాకింగ్ ట్వీట్.!

కల్కి మూవీ వెయ్యి కోట్లు దాటి పరుగులు పెడుతున్న వేళ.. నాగి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపింది. కల్కి మూవీ వర్సెస్ యానిమల్ మూవీగా సీన్‌ను మార్చేసింది. ఈ మైలురాయి, ఈ సంఖ్య మాలాంటి టీమ్ కు నిజంగా చాలా పెద్దది. ఎలాంటి అసభ్యపదజాలం, రక్తపాతం, రెచ్చగొట్టే సన్నివేశాలు లేకుండా ఇది సాధించాం..! మా వెనుక నిలిచిన ప్రేక్షకులకు, నటీనటులకు ధన్యవాదాలు!అంటూ నాగి రీసెంట్‌గా ఓ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌ను పట్టుకున్న కొంత మంది నెటిజన్స్‌.. యానిమల్ సినిమాను ఉద్దేశ్యించే నాగి ఈ ట్వీట్ చేశారంటూ.. నెట్టింట కామెంట్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో కల్కి వర్సెస్ యానిమల్ గా సిట్యువేషన్ మారింది.

02.Prabhas: బాక్సాఫీస్ కు ఒక్కడే రాజు.. అతడే ప్రభాస్ రాజు.

బాక్సాఫీస్‌కు ఒక్కడే రాజు.. అతడే ప్రభాస్‌ రాజు అంటూ ఇప్పుడు నెట్టింట కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నారు ప్రభాస్‌ ఫ్యాన్స్. ప్రభాస్‌ కల్కి మూవీ.. 1000 కోట్ల గ్రాస్‌ .. 500 కోట్ల షేర్ సాధించడంతో.. ఈ ఫీట్ చేసింది..! ఇప్పటివరకు చేయగలిగింది..! టాలీవుడ్‌ హీరోల్లో ఒక్క ప్రభాస్ మాత్రమే అంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ప్రభాస్‌ ఇప్పటికే బాహుబలి 2తో.. 500 కోట్ల షేర్ ను సాధించారు. ఇక కల్కి మూవీతో మరో సారి ఈ ఫీట్‌ చేసి.. కింగ్ ఆఫ్ టాలీవుడ్‌ అనే కామెంట్ ఫిల్మ్ సర్కిల్లో వచ్చేలా చేసుకుంటున్నారు.

03.ismart: పూరీ సినిమా పాటలో KCR డైలాగ్ BRS నేతలు ఫైర్.

రామ్ పోతినేని హీరోగా.. పూరీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ డబుల్ ఇస్మార్ట్. ఇక రీసెంట్‌గా ఈ మూవీ నుంచి మార్ ముంతా ఛోడ్‌ చింతా సాంగ్‌ను రిలీజ్ చేసిన మేకర్స్ చిక్కుల్లో పడ్డారు. బీఆర్ ఎస్ పార్టీ శ్రేణులకు కోపానికి గురయ్యారు. తమ పాటలో మాజీ సీఎం కేసీఆర్ ఏం జేద్దమంటవు అని ఓ స్పీచ్లో చెప్పిన డైలాగ్‌ను .. పాట మధ్యలో వాడేశారు. అయితే ఐటెం సాంగ్లో కేసీఆర్ లాంటి వ్యక్తి చెప్పిన మాటను వాడటాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుబడుతున్నారు. కేసీఆర్ డైలాగ్‌ను ఆ సాంగ్‌ నుంచి వెంటనే తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సినిమా రిలీజ్‌ను అడ్డకుంటామని హెచ్చరిస్తున్నారు.

04.polishetti: పొలిశెట్టికి యాక్సిడెంట్ ఇదే హెల్త్‌ అప్డేట్..

తొందర్లో తన నెక్ట్స్‌ సినిమా అప్డేట్‌తో అందరి ముందుకు వస్తాడనుకున్న నవీన్ పొలిశెట్టి.. తనకు యాక్సిండెంట్ అయిందన్న సాడ్‌ న్యూస్‌తో తన ఫ్యాన్స్‌ ముందుకు వచ్చారు. చిన్న యాక్సిడెంట్ కారణంగా.. తన చేతికి మల్టిపుల్ ఫ్యాక్చర్స్ అయ్యాయని.. కాలికి కూడా గాయాలైయ్యాయి.. త్వరగా కోలుకుని మీ ముందుకు మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ముందకు వస్తా అన్నారు. ఎప్పటిలాగే తన మీద మీ ప్రేమని కురిపించడానికి సిద్దంగా ఉండాలని ప్రేక్షకులను రిక్వెస్ట్ చేశారు.

05.amithab: ప్రభాస్‌కు 1000కోట్ల కలెక్షన్స్‌ రొటీన్‌

నార్త్‌ లో మెగాస్టార్ గా నామ్ కమాయించిన బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్.. టాలీవుడ్ హీరో.. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌ పై క్రేజీ కామెంట్స్ చేశారు. ప్రభాస్కు వెయ్యి కోట్ల కలెక్షన్స్‌ రొటీన్ అయిపోయాయని అన్నారు. కల్కి సినిమా భారీ సక్సెస్కు కథపై ప్రొడ్యూసర్‌కు ఉన్న భారీ నమ్మకమే కారణం అన్నారు. ఈ గ్రేట్‌ మూవీలో తనకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు ధన్యవాదాలు చెప్పారు.

06.sardar: సర్దార్ 2 సెట్లో ప్రమాదం.. స్టంట్ మ్యాన్ మృతి

కార్తి హీరోగా పిఎస్ మిత్రన్ తెరకెక్కించిన చిత్రం సర్దార్. 2022లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ చిత్ర సీక్వెల్‌ షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. అయితే ఈ సెట్‌లోనే అనుకోని ప్రమాదం జరిగింది. ఓ ఫైట్ సీక్వెన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో.. స్టంట్ మెన్ ఒకరు 20 అడుగుల ఎత్తు నుండి పడి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. అంతేకాదు ప్రమాదం జరిగన సమయంలో హీరో కార్తీ కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం.

07. darshan: జైల్లో ఉన్నా.. కన్నడలో ఏమాత్రం తగ్గని దర్శన్ క్రేజ్‌.

రేణుకా స్వామి హత్య కేసులో ఏ2 ముద్దాయిగా జైల్లో ఉన్నప్పటికీ.. బయట కన్నడ గడ్డపై దర్శన్ క్రేజ్‌ మాత్రం అలాగే ఉంది. ఇన్‌ఫాక్ట్ కొద్దిగా పెరిగింది. ఇక ఇదే విషయం ఆర్మాక్స్ మీడియా రీసెంట్‌ సర్వేలో తేలింది. శాండిల్‌ వుడ్‌లో మోస్ట్ పాపులర్ స్టార్ ఎవరంటూ చేసిన ఆర్మాక్స్ మీడియా సర్వేలో.. టాప్‌ 5లో 4th ప్లేస్ దర్శన్‌కు దక్కడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఈ లిస్టులో ఫస్ట్‌ ప్లేస్‌లో కేజీఎఫ్ స్టార్ యశ్‌ నిలవగా.. ఆ తరువాత సుదీప్ కిచ్చి… రక్షిత్ షెట్టి, దర్శన్. రిషబ్ షెట్టిలు స్థానం సంపాదించారు.

08.janvi: 1st సినిమా రిలీజే అవ్వలేదు అప్పుడే తెలుగు స్టార్ నుంచి మరో బంపర్ ఆపర్

టాలీవుడ్లో తన డెబ్యూ ఫిల్మ్ దేవర ఇంకా రిలీజ్ అవ్వనే లేదు అప్పుడే మరో సినిమాలో ఛాన్స్‌ కొట్టేసింది జాన్వీ కపూర్. దేవర సెట్లో ఉండగానే.. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ బుచ్చిసనా సినిమాలో బంపర్ ఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ…రీసెంట్గా నాని సినిమాలోనూ భాగమైపోయిందట. దసరా ఫేమ్‌ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని హీరోగా చేయబోయే పాన్ ఇండియా సినిమాకు తాజాగా సైన్ చేసిందట ఈ బ్యూటీ.

09.narayana murthi: R. నారాయణ మూర్తికి అస్వస్థత నిమ్స్‌లో రెబల్ స్టార్.

కార్మికుల జీవిత వ్యథలను సినిమాలుగా మలిచి జనాల్లో గొప్ప పేరు తెచ్చుకున్న ఆర్ నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. నిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటికి రావడంతో.. ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం షురూ చేశారు. దీంతో తన ఆరోగ్యం బానే ఉందంటూ.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ.. మీడియాకు చెప్పారు ఆయన. అంతేకాదు తాను పూర్తిగా కోలుకున్నాక.. తన ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు చెబుతా అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Jul 18, 2024 07:54 AM