TOP9 ET: ఇక నుంచి Jr.NTR కాదు Mr.NTR | సమంతతో డేటింగ్.? అసలు ఎవరీ రాజ్.?
సమంతతో డైరెక్టర్ రాజ్ డేటింగ్‌లో ఉన్నాడని గత రెండు రోజులుగా నెట్టింట వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ.. వీరిద్దరి సోషల్ మీడియా హ్యాండిల్లో కలిసి ఉన్న ఫోటోలు వస్తున్నాయి. అవి కాస్త విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈక్రమంలోనే సమంత ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ ఎవరీ రాజ్ అంటూ ఆరాతీస్తున్నారు. నెట్టింట ఈ డైరెక్టర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజ్ ఎవరో కాదు..
01. Samantha: సమంతతో డేటింగ్.? అసలు ఎవరీ రాజ్.? సమంతతో డైరెక్టర్ రాజ్ డేటింగ్‌లో ఉన్నాడని గత రెండు రోజులుగా నెట్టింట వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ.. వీరిద్దరి సోషల్ మీడియా హ్యాండిల్లో కలిసి ఉన్న ఫోటోలు వస్తున్నాయి. అవి కాస్త విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈక్రమంలోనే సమంత ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ ఎవరీ రాజ్ అంటూ ఆరాతీస్తున్నారు. నెట్టింట ఈ డైరెక్టర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజ్ ఎవరో కాదు.. తెలుగు వాడే. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జన్మించారు. ఇంజనీరింగ్ తర్వాత హైయర్ స్టడీస్ కోసం అమెరికాకు వెళ్లి.. తన ఫ్రెండ్ కృష్ణ డీకేతో కలిసి డీ2ఆర్ ఫిల్మ్ బ్యానర్‌ను స్థాపించారు. షార్ట్ ఫిల్మ్ నుంచి.. ఇప్పుడు బాలీవుడ్‌లో సినిమాలు తీస్తూ.. బెస్ట్ డైరెక్టర్స్‌గా మారిపోయారు. అన్నట్టు .. ఈ డైరెక్టర్ మన మెగాస్టార్ చిరుకు క్రేజీ ఫ్యాన్ కూడా..! 02.ntr: ఇక నుంచి Jr.Ntr కాదు Mr. NTR.! ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టింది మొదలు.. ఎన్టీఆర్‌ను జూనియర్ ఎన్టీఆర్ అనే అంటున్నాం! పెద్ద ఎన్టీఆర్‌కు జూనియార్ వర్షన్‌గా ఫీలవుతున్నాం! అయితే ఇప్పుడీ పేరే మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ కాదు.. మిస్టర్ ఎన్టీఆర్‌గా మారిపోయింది. రీసెంట్‌గా ఎన్టీఆర్ టీం.. ఎన్టీఆర్‌కు ప్రమాదం జరిగినట్టు వైరల్ అయిన న్యూస్ పై క్లారిటీ ఇస్తూ ఓ నోట్ రిలీజ్ చేసింది. అయితే ఈ నోట్‌లో.. జూనియర్ ఎన్టీఆర్ బదులు.. మిస్టర్ ఎన్టీఆర్...