తగ్గక తప్పట్లేదు.. హీరోల రెమ్యునరేషన్‌లో భారీగా కోతలు

Updated on: Feb 14, 2026 | 2:10 PM

టాలీవుడ్‌లో హీరోల పారితోషికాలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఓటీటీ డీల్స్ తగ్గడంతో, నిర్మాతలు బడ్జెట్‌ను నియంత్రించేందుకు హీరోల రెమ్యూనరేషన్లలో కోతలు విధిస్తున్నారు. రవితేజ, నాని, సాయి ధరమ్ తేజ్, బాలయ్య వంటి స్టార్లు సైతం స్థిరమైన పారితోషికం కంటే సినిమా లాభాల్లో వాటా తీసుకోవడానికి సిద్ధమవుతున్నవారు. ఇది సినిమా బడ్జెట్‌ను అదుపులో ఉంచే కొత్త పద్ధతి.

టాలీవుడ్‌లో స్టార్ హీరోల పారితోషికాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. గతంలో ఒక్కో సినిమాకు వందల కోట్లు అందుకున్న అగ్రశ్రేణి హీరోలు, అలాగే 30 కోట్లు అడిగిన మీడియం రేంజ్ హీరోలు ఇప్పుడు పారితోషికం విషయంలో రాజీ పడక తప్పట్లేదు. ఓటీటీ డీల్స్ గణనీయంగా తగ్గడం దీనికి ప్రధాన కారణం. బడ్జెట్ నియంత్రణ కోసం నిర్మాతలు హీరోల రెమ్యూనరేషన్‌లో కోతలు విధిస్తుండగా, హీరోలు కూడా దీనికి అంగీకరిస్తున్నారు. పారితోషికానికి బదులుగా లాభాల్లో వాటా తీసుకునే ధోరణి పెరుగుతోంది. దీనివల్ల బడ్జెట్‌పై భారం తగ్గుతుంది. రవితేజ వంటి హీరోలు తమ పారితోషికం 20-25 కోట్లు దాటితే, మొత్తం బడ్జెట్ 40 కోట్లు, వీఎఫ్ఎక్స్ ఆధారిత చిత్రాలకైతే 80 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న క‌వ‌లల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!

బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!

బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!

సొంతకారులో ఉత్సాహంగా ఇంటికి వెళ్తున్న యువకుడు..అంతలోనే..

హాస్టల్‌లో ఉండటానికి భయపడుతున్న విద్యార్థులు.. ఎందుకంటే?