హిట్టు కొట్టు గురూ.. లేకపోతే అంతే సంగతులు.. కుర్ర హీరోలకు అల్టిమేటం

Edited By:

Updated on: Mar 23, 2026 | 7:35 PM

టాలీవుడ్‌లో చాలా మంది స్టార్ హీరోలు ప్రస్తుతం ఒక పెద్ద హిట్ కోసం ఆరాటపడుతున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ నిలబెట్టుకోవాలన్నా, మార్కెట్ స్థానాన్ని పదిలం చేసుకోవాలన్నా వారికి సాలిడ్ కంబ్యాక్ అవసరం. వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు', సాయి ధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు', నిఖిల్ 'స్వయంభు' వంటి సినిమాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ హీరోలంతా తమ తదుపరి చిత్రాలపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఇందాక మనం హిట్లలో ఉండి టెన్షన్ పడుతున్న హీరోలను చూసాం కదా.. ఇప్పుడు హిట్టు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వాళ్లను చూద్దాం. ప్యాన్ ఇండియా ఇమేజ్ కాపాడుకోవడానికి కొందరు.. ఒక్క హిట్టంటూ మరికొందరు నానా తంటాలు పడుతున్నారు. మరి సాలిడ్ కంబ్యాక్ కోసం, మార్కెట్ నిలబెట్టుకోవడం కోసం ఎవరెవరు ఎలాంటి మాస్టర్ ప్లాన్స్‌తో రాబోతున్నారో చూద్దామా..? చాలా కాలంగా సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్న వరుణ్ తేజ్.. మట్కా, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ లాంటి ఫ్లాపుల తర్వాత ఆశలన్నీ ‘కొరియన్ కనకరాజు’ సినిమాపైనే పెట్టుకున్నారు. సాయి ధరమ్ తేజ్ కూడా బ్రో సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో.. సంబరాల ఏటిగట్టుతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. డిజే టిల్లు ఫ్రాంచైజీతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధూ జొన్నలగడ్డ.. ఆ ఇమేజ్ నుంచి బయటపడి వేరే కథలతో కూడా సోలోగా తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్తికేయ 2తో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్.. అది నిలబడాలంటే స్వయంభు, ది ఇండియా హౌజ్ సినిమాలతో తప్పకుండా హిట్స్ కొట్టాల్సిందే. సందీప్ కిషన్ కూడా ఒక సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ క్రమంలోనే శంబాలా ఫేమ్ యుగంధర్ మునితో సోషియో ఫాంటసీ అనౌన్స్ చేసారు. అఖిల్ సైతం లెనిన్‌తో ఫస్ట్ బ్లాక్‌బస్టర్ కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. కోర్టు ఫేమ్ హర్ష్ రోషన్ అది గాలివాటం కాదని నిరూపించాలంటే బ్యాండ్ మేళంతో హిట్ కొట్టాల్సిందే. ఇది సింపుల్‌గా మన హీరోల సిచ్యువేషన్ ఇప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాన్ ఇండియన్ సినిమాలకు సౌత్ బ్యూటీస్ పనికిరారా..?

యంగ్ హీరోలకు అసలైన అగ్నిపరీక్ష

పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??

Allu Arjun: ఏ స్టార్ హీరోకి సాధ్యం కానిది.. అల్లు అర్జున్ మాత్రమే ఎలా సాధ్యం

BIKER Trailer : బైకర్‌ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్‌

Follow Us