మళ్లీ థియేటర్లలో మెగా మాస్.. నాగ్ క్లాసిక్! ఆగస్టులో రీ రిలీజ్ సినిమాల జాతర

Edited By:

Updated on: Aug 22, 2026 | 8:11 PM

టాలీవుడ్‌లో మళ్లీ రీ రిలీజ్ ట్రెండ్ ఊపందుకుంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘దూకుడు’కు వచ్చిన రెస్పాన్స్‌తో ఈ ట్రెండ్ మరింత జోరందుకుంది. ఇప్పుడు చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ‘ముఠామేస్త్రీ’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ సినిమాలు రీ రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. అలాగే నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ‘గీతాంజలి’ 4కే వర్షన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఆగస్టులో థియేటర్ల వద్ద అభిమానుల సందడి మరింత పెరగనుంది.

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఓ రేంజ్‌లో జోరు చూపించిన రీ రిలీజ్ ట్రెండ్ మధ్యలో కాస్త స్లో అయ్యింది. కానీ ఇప్పుడు మళ్లీ పాత వైభవాన్ని తెచ్చుకుంటోంది. ఆగస్టు నెలలో వరుసగా స్టార్ హీరోల పుట్టినరోజులు ఉండటంతో మరోసారి థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున బర్త్ డేల సందర్భంగా బ్లాక్ బస్టర్ హిట్స్ మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. మరి ఆ సినిమాలేంటో మీరు కూడా చూసేయండి. ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా దూకుడు సినిమా రీ రిలీజ్ చేయటం ఆ మూవీకి మంచి రెస్పాన్స్ రావటంతో మరోసారి రీ రిలీజ్ ట్రెండ్ జోరందుకుంది. ఇప్పుడు అదే ఊపును కంటిన్యూ చేస్తూ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు రంగంలోకి దిగుతున్నారు. ఆగస్టు నెలలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున పుట్టినరోజులు ఉండటంతో అభిమానులకు పూనకాలు తెప్పించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా బాక్సాఫీస్ దగ్గర డబుల్ ధమాకా ప్లాన్ చేశారు. వింటేజ్ మెగాస్టార్ కామెడీ టైమింగ్‌ను గుర్తు చేసే ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ మూవీని 22న, మెగా మాస్ స్టామినాను చూపించిన ‘ముఠామేస్త్రీ’ సినిమాను 21న రీ రిలీజ్ చేస్తున్నారు. ఒకేసారి మాస్, ఎంటర్‌టైన్‌మెంట్‌ కలగలిపిన రెండు బ్లాక్‌బస్టర్స్ వస్తుండటంతో.. ఫ్యాన్స్ కటౌట్స్, డ్యాన్స్‌లతో థియేటర్ల దగ్గర రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆగస్టు 29న కింగ్ నాగార్జున పుట్టినరోజు కానుకగా టాలీవుడ్ ట్రెండ్‌సెట్టర్ క్లాసిక్ లవ్ స్టోరీ ‘గీతాంజలి’ సినిమాను 4కే వర్షన్‌లో ఈ నెల 28న గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మణిరత్నం మ్యాజిక్, ఇళయరాజా మ్యూజిక్ మళ్లీ సిల్వర్ స్క్రీన్ మీద బెస్ట్ క్వాలిటీతో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ ట్రెండ్‌ చూస్తుంటే ఈ ఆగస్టు నెల మొత్తం రీ రిలీజ్ సినిమాలతో థియేటర్లు కళకళలాడటం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాన్,ఆధార్ వాట్సాప్‌లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల

బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్‌ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్‌ చేసుకోవాలి?

వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !

కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!

అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి

Loading...
Unable to load recommendations.
Follow Us