జాతర.. ఇది మాస్ జాతర అంటున్న స్టార్ హీరోలు

Edited By:

Updated on: Mar 08, 2026 | 3:16 PM

కుటుంబ కథా చిత్రాలు విజయం సాధిస్తున్నా, టాలీవుడ్ హీరోల దృష్టి మాస్ యాక్షన్ సినిమాలపైనే ఉంది. ప్రభాస్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ కూడా భారీ యాక్షన్, రక్తపాతాన్ని ఇష్టపడుతున్నారు. ఇది తెలుగు సినిమా పరిశ్రమలో తాజా ట్రెండ్. ఫ్యామిలీ హిట్స్ వచ్చినా, యాక్షన్ చిత్రాల వైపే మొగ్గు చూపుతూ రికార్డులను సృష్టిస్తున్నారు. మాస్ కథల వైపు ఈ ప్రస్థానానికి గల కారణాలను విశ్లేషిద్దాం.

ఓ వైపు ఫ్యామిలీ సినిమాలు దున్నేస్తున్నా.. ఇండస్ట్రీ రికార్డులు కుమ్మేస్తున్నా హీరోల మనసు మాత్రం మాస్ వైపు.. రక్తపాతం వైపే అడుగులేస్తుంది. చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అంతా యాక్షన్ సినిమాలు కావాలని పట్టు పడుతున్నారు. మాస్ వైపే మొగ్గు చూపుతున్నారు. కమర్షియల్ కథల కోసమే రక్తం చిందిస్తున్నారు. అసలేం ఉంది ఈ మాస్ కథల్లో.. చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా..?
చాలా ఏళ్ళ తర్వాత ప్రభాస్ తనను తాను మార్చుకుని పూర్తిగా ఎంటర్‌టైన్మెంట్ జోన్‌లోకి వెళ్లి చేసిన రాజా సాబ్ ఫలితం అందరికీ తెలిసిందే. అందుకే తనకి అలాంటివి వద్దని.. మళ్లీ మాస్ వైపే వస్తున్నారు రెబల్ స్టార్. నెక్ట్స్ చేయబోయే సినిమాల్లో కల్కి 2, ఫౌజీ మినహాయిస్తే.. మిగిలినవన్నీ మాస్ అండ్ కమర్షియల్ కథలే. ఫ్యామిలీ కథతో హిట్ కొట్టిన చిరంజీవి సైతం నెక్ట్స్ మాసే కావాలంటున్నారు. శంకరవరప్రసాద్ గారు కుటుంబ ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో కలెక్షన్లే సాక్ష్యం. అంతటి హిట్ తర్వాత.. బాబీతో కోల్‌కత్తా నేపథ్యంలో యాక్షన్ సినిమా చేయబోతున్నారు మెగాస్టార్. నారీనారీ నడుమ మురారితో హిట్ కొట్టిన శర్వా.. భోగి అంటూ సంపత్ నందితో కలిసి భారీ యాక్షన్ సినిమాతో రాబోతున్నారు. విజయ్ దేవరకొండకు గత ఐదేళ్లలో ఊరటనిచ్చిన సినిమా ఖుషీ. అది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కానీ దాని తర్వాత వరసగా మాస్ సినిమాలే చేస్తున్నారు రౌడీ. ఫ్యామిలీ స్టార్ నిరాశపరచడంతో యాక్షనే బెస్ట్ అంటున్నారీయన. గతేడాది వచ్చిన కింగ్డమ్‌లో రక్తపాతానికి ఢోకా లేదు.. నెక్ట్స్ రాబోయే రౌడీ జనార్ధనతో పాటు రాహుల్ సంక్రీత్యన్‌తో చేస్తున్న రణబాలిలోనూ ఫుల్ వయొలెన్స్ ఉండబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ సైతం దేవర, వార్ 2లో కావాల్సినంత రక్తపాతం సృష్టించారు.. నెక్ట్స్ ప్రశాంత్ నీల్ సినిమాలోనూ అదే కంటిన్యూ కానుంది. ఇక శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్‌తో చిన్నసైజ్ విధ్వంసమే సృష్టిస్తున్నారు. బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమా సైతం ఊర మాస్ యాంగిల్‌లోనే రెడీ అవుతుంది. రామ్ చరణ్ పెద్ది సైతం పక్కా మాస్. ఎలా చూసుకున్నా నెక్ట్స్ అంతా ఇండస్ట్రీలో మాస్ ప్రభంజనమే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కంటెంట్ ఉన్నపుడు భయమేలా.. 100 కాదు 200 కోట్లు పెడదాం..!

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌ విషయం లో అలా చేయడం.. లాభమా.. ? నష్టమా..?

Virosh Wedding: ఇన్‌స్టాలో విరోష్ వెడ్డింగ్ సాంగ్ కొత్త రికార్డ్..

Follow Us