పెళ్లి కార్డ్‌తో పాటే.. సర్‌ప్రైజ్ గిఫ్ట్.. VD ఏం ఇస్తున్నారంటే
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ తేదీ, వేదిక వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో పెళ్లి, మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది. వారి ప్రత్యేక వెడ్డింగ్ కార్డ్ బాక్స్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ బాక్సులో రష్మిక పర్ఫ్యూమ్, విజయ్ రౌడీ బ్రాండ్ టీ-షర్ట్ వంటి ఆకర్షణీయమైన బహుమతులు ఉన్నాయి. బంధుమిత్రులు, సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
టాలీవుడ్ ప్రేమ పక్షులు విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లికి కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఇప్పటికే విజయ్ ఇంటికి లైటింగ్ డెకరేషన్ కూడా పెట్టారు. అలాగే పెళ్లి కార్డుల పంపిణీ కూడా జరుగుతోంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయపూర్ లోని ఓ ప్యాలెస్ లో విజయ్-రష్మికల పెళ్లి జరగనుంది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరుకానున్నారు. ఆ తర్వాత మార్చ్ 4న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో గ్రాండ్ గా రిసెప్షన్ జరగనుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ రిసెప్షన్ కు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం విజయ్- రష్మికల వెడ్డింగ్ కార్డ్ ఇప్పటికే నెట్టింట వైరల్ గా మారింది. వీరు తమ పెళ్లికి వచ్చే అతిథులకు పెళ్లి కార్డుని ఓ స్పెషల్ బాక్స్ లో ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఈ బాక్స్ లో పెళ్లి కార్డుతో పాటు అతిథులకు కొన్ని సర్ ప్రైజ్ అండ్ స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఈ మేరకు వెడ్డింగ్ ఇన్విటేషన్ అందుకున్న కొందరు పెళ్లి కార్డు బాక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రష్మిక మందన్నా కొన్ని నెలల క్రితం ఒక పెర్ఫ్యూమ్ కంపెనీని ప్రారంభించింది. ఇప్పుడు ఆ కంపెనీకి చెందిన నేషనల్ క్రష్ అనే పెర్ఫ్యూమ్ బాటిల్ చిన్నది ఒకటి ఈ పెళ్లి కార్డు బాక్స్ లో పెట్టారు. అలాగే చేతులకు, కాళ్లకు రాసుకునే ఒక ఆయుర్వేదిక్ క్రీమ్ ఒకటి ఇచ్చారు. ఇక హీరో విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ కి చెందిన టీ షర్ట్ ఒకటి బాక్స్ లో పెట్టారు. అలాగే జీడిపప్పు ప్యాకెట్, ఒక స్వీట్ బాక్స్ కూడా ఇందులో ఉన్నాయి. మొత్తానికి విజయ్ – రష్మిక వెడ్డింగ్ కార్డు బాక్స్ లో ఈ సర్ ప్రైజ్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varanasi: ఆ ఒక్క ఎపిసోడ్‌కే రూ.300 కోట్లు.. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్న జక్కన్న
Mohan Babu: కిడ్నాప్ కేసులో.. మోహన్ బాబుకు బిగ్ షాక్
Chiranjeevi: ఓ శశిరేఖా.. ఓ మాట చెప్పాలి
