తిడుతూ.. చితకబాదుతూ.. క్యాబ్ డైవర్ పై కాట్రాజ్ దౌర్జన్యం!
హైదరాబాద్‌లో నటుడు సుప్రీత్ రెడ్డి అలియాస్ కాట్రాజ్ వివాదంలో చిక్కుకున్నారు. నాగారం ప్రాంతంలో క్యాబ్ రోడ్డుకు అడ్డంగా ఉందన్న కారణంతో ఉబర్ డ్రైవర్ శ్రీహరిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, సుప్రీత్‌కు నోటీసులు జారీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
హైదరాబాద్‌లో టాలీవుడ్ నటుడు సుప్రీత్ రెడ్డి అలియాస్ కాట్రాజ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. రోడ్డుపై కారు అడ్డంగా ఆపారనే చిన్న కారణంతో ఒక క్యాబ్ డ్రైవర్‌పై ఆయన దౌర్జన్యం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో ఈ గొడవ చోటుచేసుకుంది. శ్రీహరి అనే వ్యక్తి ఉబర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నాగారం చౌరస్తా ప్రాంతంలో ఒక ట్రిప్ పూర్తి చేసుకున్న శ్రీహరి, తదుపరి బుకింగ్ కోసం తన క్యాబ్‌ను రోడ్డు పక్కన నిలిపి వేచి చూస్తున్నాడు. అదే సమయంలో నటుడు సుప్రీత్ రెడ్డి తన ఫార్చునర్ కారులో ఆ మార్గంలో వచ్చారు. అయితే, క్యాబ్ కాస్త రోడ్డుకు అడ్డంగా ఉందనే ఉద్దేశంతో సుప్రీత్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. వెంటనే తన కారు దిగి, డ్రైవర్ శ్రీహరి వద్దకు వెళ్లి అసభ్య పదజాలంతో దూషించడం ప్రారంభించారు. డ్రైవర్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినకుండా, రోడ్డుపై అందరూ చూస్తుండగానే శ్రీహరిపై విచక్షణారహితంగా దాడి చేసి చితకబాదారు. నటుడి చేతిలో దెబ్బలు తిన్న క్యాబ్ డ్రైవర్ శ్రీహరి ఘటనా స్థలం నుంచే ‘డయల్ 100’ ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. కీసర పోలీసులు తక్షణమే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం బాధితుడి రాతపూర్వక ఫిర్యాదు మేరకు పోలీసులు నటుడు సుప్రీత్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గొడవ జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను విశ్లేషించి, ఆధారాల ప్రకారం సుప్రీత్‌కు నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
