Irumudi: ఇరుముడి’కి పాజిటివ్ టాక్.. రవితేజ కెరీర్‌లో రికార్డ్ ఓపెనింగ్స్
ఇటీవల సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. అందుబాటులో ఉన్న టికెట్ ధరలు కూడా ఈ విజయాలకు ఓ కారణంగా మారాయి. అయితే ఆగస్టు 26న విడుదల కానున్న ‘టాక్సిక్’ కోసం మేకర్స్ టికెట్ రేట్ల పెంపు కోరుతున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ కారణంగా హైక్స్ అవసరమని నిర్మాతలు చెబుతున్నా, డబ్బింగ్ సినిమాకు ధరలు పెంచితే థియేటర్లకు వస్తున్న ప్రేక్షకులపై ప్రభావం పడుతుందనే చర్చ మొదలైంది.
ఇప్పుడిప్పుడే అంతా సెట్ అవుతుంది.. థియేటర్లకు ఆడియన్స్ బాగానే వస్తున్నారు. కాస్త యావరేజ్ టాక్ వచ్చినా కూడా నెత్తిన పెట్టుకుంటున్నారు సినిమాలను.. ఇలాంటి టైమ్‌లో మళ్లీ టికెట్ హైక్స్ చర్చ మొదలైంది. మరి రేట్లు పెంచితే ఆడియన్స్ మైండ్ సెట్ అలాగే ఉంటుందా.. థియేటర్స్ కళ పెరుగుతుందా తగ్గుతుందా..? అసలు ఏ సినిమా కోసం హైక్స్ అడుగుతున్నారు..? ఏ దేవుడు కరుణించాడో కానీ గత రెండు నెలలుగా థియేటర్స్ అన్నీ కళకళలాడుతున్నాయి. కనీసం వారానికో సినిమా బయ్యర్లకు కాసుల పంట పండిస్తుంది. పెద్ది మొదలుపెట్టిన ఈ విజయాలను లెనిన్, మా ఇంటి బంగారం, చెన్నై లవ్ స్టోరీ, కొరియన్ కనకరాజు కంటిన్యూ చేసాయి. తాజాగా ఇరుముడికి రవితేజ కెరీర్‌లోనే రికార్డ్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. డే 1 చాలా పెద్ద నెంబర్ తీసుకొచ్చేలా ఉంది ఈ చిత్రం. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ ఇంత బాగా పర్ఫార్మ్ చేయడానికి కంటెంట్ ఓ కారణమైతే.. అందుబాటులో ఉన్న టికెట్ రేట్లు మరో ప్రధాన కారణం. పెద్ది మినహాయిస్తే ఏ సినిమాకు నిర్మాతలు హైక్స్ అడగలేదు. ఈ ఒక్క రీజన్‌తోనే ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్, డిసి లాంటి డబ్బింగ్ సినిమాలకు కాసుల పంట పండటానికి కారణమిదే. తాజాగా ఇరుముడి ఓపెనింగ్స్ మీద రేట్ల ప్రభావం బానే ఉంది.. సినిమాపై ఉన్న హైప్‌కు తోడు తక్కువ రేట్లు ఉండటంతో థియేటర్లకు పోటెత్తుతున్నారు ఆడియన్స్. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది.. కానీ అసలు చిక్కు ఇక్కడ్నుంచే మొదలయ్యేలా ఉంది.. ఆగస్ట్ 26న రానున్న టాక్సిక్ కోసం హైక్స్ అడుగుతున్నారు మేకర్స్.. 500 కోట్ల బడ్జెట్ కాబట్టి రేట్లు పెంచడం అనివార్యం అనేది వాళ్ల వాదన. టాక్సిక్ తెలుగు సినిమా కాదు.. డబ్బింగ్ సినిమాకు రేట్ల పెంపు అనేది ఆలోచించాల్సిన విషయమే. పైగా ఇప్పుడిప్పుడే థియేటర్లకు అలవాటు పడుతున్న ఆడియన్స్‌ని రేట్ల పేరుతో భయపెడితే అసలుకే మోసం రాకపోదు. ఈ రేట్ల హైక్స్ అనేది మన పెద్ద సినిమాలనే దెబ్బకొట్టింది. అందుకే ఇవన్నీ బాగా ఆలోచించి హైక్స్ అడగాల్సి ఉంటుంది. అన్నింటికీ మించి ప్రేక్షకుల మైండ్ సెట్ మారకుండా చూడాలి.
